మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా అభిమానులు స్పెషన్ సాంగ్ ను విడుదల చేయనున్నారు.ఈ నెల 22వ తేదీతో 65 ఏళ్లు పూర్తి చేసుకుంటారు చిరంజీవి.
ఈ మేరకు రామ్ చరణ్ యువశక్తి ఓ స్పెషల్ సాంగ్ ను విడుదల చేయబోతుంది.‘మెగాస్టార్ స్ మెగా ర్యాప్’ పేరుతో పాటను విడుదల చేస్తున్నారు.
ఈ పాటకు వెంకటాద్రి టాకీస్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్, రాష్ట్ర రామ్ చరణ్ యువశక్తి వ్యవస్థాపక అధ్యక్షుడు శివ చెర్రీ నిర్మించారు.పాటకు సంబంధించి అనౌన్స్ మెంట్ పోస్టర్ ను శనివారం విడుదల చేశారు.
కాగా, ‘మెగాస్టార్ స్ మెగా ర్యాప్’ పాటను ఈ నెల 21 వ తేదీన విడుదల చేయనున్నట్లు రామ్ చరణ్ యువశక్తి వ్యవస్థాపక అధ్యక్షుడు శివ వెల్లడించాడు.గతంలో రామ్ చరణ్ పుట్టిన రోజు సందర్భంగా శివ చెర్రీ స్పెషల్ సాంగ్ ను విడుదల చేసిన విషయం అందరికి తెలిసిందే.
ఆ సాంగ్ ప్రముఖుల ప్రశంసలు అందుకుంది.అయితే మెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజుకి ముందు మెగా ర్యాప్ ను విడుదల చేస్తున్నామని, పాటకు ఎలాంటి స్పందన వస్తుందో వేచి చూడాలని శివ చెర్రీ వెల్లడించాడు.