అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అధికార దుర్వినియోగానికి పాల్పడ్డాడని ఆయన్ని అభిశంసించాలని ఇప్పటికే డెమొక్రటిక్ పార్టీ నేతలు పట్టుబట్టిన విషయం విదితమే.ఇప్పటికే సెనేట్ ముందుకు వచ్చిన అభిశంసన బిల్లుపై విచారణ ప్రారంభమయ్యింది.
ఈ విచారణ గనుకా ట్రంప్ కి వ్యతిరేకంగా వస్తే ట్రంప్ పదవీత్యుడుడు కాక తప్పదు.అంతేకాదు అమెరికా చరిత్రలోనే అభిశంసించబడిన మూడవ అధ్యక్షుడిగా ట్రంప్ నిలిచిపోతారు.
ఇప్పటికే అభిశంసన అంశంతో తలలు పట్టుకుంటున్న ట్రంప్ వర్గం, తాజాగా మాజీ భద్రతా సలహా దారు జాన్ బోల్ట్ న్ రాసిన పుస్తకంతో మరింతగా ఇరకాటంలో పడ్డారు.అమెరికా మాజీ ఉపాధ్యక్షుడు జో బిడెన్ విషయంలో ట్రంప్ చేసిన కుట్రలని బయటపెట్టి డెమొక్రాట్లు ప్రవేశపెట్టిన అభిశంసన కి కీలకమైన జాన్.
తాజాగా మరో కొన్ని విషయాలని బయటపెట్టారు.అంతేకాదు తాను తాజాగా రాసిన పుస్తకంలో ఇలాంటి ఎన్నో విషయాలు ఉన్నాయని ప్రకటించారు జాన్.త్వరలో ఈ పుస్తకం విడుదల అవ్వడానికి సిద్ధంగా ఉందని జాన్ తెలుపడంతో వైట్ హౌస్ వర్గాలు అలెర్ట్ అయ్యాయి.
జాన్ బోల్ట్ న్ రాసిన పుస్తకాన్ని సమీక్షించిన సెక్యూరిటీ కౌన్సిల్ అధ్యక్షుడికి చెందిన కీలక సమాచారం ఉండటంతో వీటిని తోలగించకుండా, మార్పులు చేయకుండా ఎట్టి పరిస్థితుల్లో చేయకూడదని ఆదేశాలు జారీ చేసింది.
అయితే అభిశంసన విచారణ జరిగే సమయంలో సెనేట్ ముందుకు జాన్ బోల్ట్ న్ ని కూడా పిలిచి విచారణ చేపట్టాలని డెమొక్రాట్లు పట్టు పడుతున్నారు.