తెలుగు రాష్ట్ర రాజకీయాలపై మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు( Venkaiah Naidu ) సంచలన వ్యాఖ్యలు చేశారు.శుక్రవారం నాడు తిరుమల శ్రీవారి దర్శనం( Tirumala Darshan ) కోసం వెళుతూ రేణిగుంట విమానాశ్రయంలో మీడియాతో మాట్లాడారు.
తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో ఓటు వినియోగం పై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.ప్రజాస్వామ్యంలో ఓటు అనేది ఎంతో విలువైనది.
ప్రతి ఒక్కరు ఎన్నికలలో ఓటు హక్కు( Right To Vote ) వినియోగించుకోవాలని స్పష్టం చేశారు.ఈ క్రమంలో నీతి నిజాయితీగా నిక్కచ్చిగా పనిచేసే వారికి ఎన్నికల్లో గెలిపించుకోవాలని తెలిపారు.
అవినీతి అక్రమాలకు పాల్పడని వారిని ఎన్నుకోండి.ప్రలోభాలకు గురైతే ఐదేళ్లు బాధపడాల్సి ఉంటుందని తెలిపారు.కులానికి.ధనానికి ప్రలోభ పడకుండా గుణాన్ని బట్టి ఓటు వేయండి.ఇదే సమయంలో టీటీడీ హిందూ ధర్మిక సంస్థ విరాళాలను.పురాతన దేవాలయాల పునరుద్ధరణకు ఖర్చు పెట్టాలని వెంకయ్య నాయుడు సూచించడం జరిగింది.
నవంబర్ 30వ తారీకు తెలంగాణ రాష్ట్రంలో మూడోసారి అసెంబ్లీ ఎన్నికలు( Telangana Assembly Elections ) జరగబోతున్నాయి.ఈ క్రమంలో ఇప్పటికే ఎలక్షన్ కమిషన్ అన్ని ఏర్పాట్లు చేస్తూ ఉంది.
మరోపక్క వివిధ పార్టీల నాయకులు పోటీ చేసే అభ్యర్థులు నామినేషన్ లు కూడా దాఖలు చేస్తున్నారు.ఈ క్రమంలో తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో వెంకయ్య నాయుడు చేసిన వ్యాఖ్యలు తెలుగు రాజకీయాల్లో సంచలనంగా మారాయి.