కియా కార్లను కొనకండి – మోసపోకండి..!

అసంతృప్తతో ఉండే కస్టమర్లు నిజంగా ఎంత దూరమైన వెళతారు.హర్యానాలోని గురుగ్రామ్‌లో సదరు యజమాని చేసిన పని ఇప్పుడు ఇంటర్నెట్ లో వైరల్ గా మారింది.

 Dont Buy Kia Cars Dont Be Fooled, Kia Car , Buying , Cheating , Viral Latest-TeluguStop.com

కియా కారుపై ఓ యాజమాని కోపంతో వాహనం వెనుక భాగాన ‘కియా కార్లను కొనకండి – మోసపోకండి’ అంటూ ఓ బ్యానర్‌ను కట్టి కారును ఊరేగించాడు.ప్రస్తుతం ఇది ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారింది.

అయితే తన అసంతృప్తికి కారణమేమిటో అతను తెలియజేయలేదు.“కియా కార్లు కొనాలనుకునేవారు అప్రమత్తంగా ఉండండి, నేను కియా చెత్తను రూ.19 లక్షలకు కొన్నాను” అనే బ్యానర్‌ తన కారుకు అతికించి సదరు యజమాని తిరుగుతున్నాడు.ఆ బ్యానర్లలో అతను తన ఫోన్ నంబర్ ను సైతం ఉంటాడు.

వివరాల్లోకి వెళ్తే.సదరు కస్టమర్ హర్యానాలోని గురుగ్రామ్‌లో ఉన్న కియా ప్రధాన కార్యాలయం చుట్టూ తన కారెన్స్ MPV కారును నడిపాడు.కియా అధికారుల దృష్టిలో పడేందుకే ఇలా చేశాడని తెలుస్తోంది.అయితే.

కియా కారు పట్ల ఎందుకు అతడు అసంతృప్తి చెందాడో?, ఎందుకలా కారును కార్యాలయం చుట్టూ తిప్పాడో? ఎలాంటి సమాచారం లేకపోవటంతో పలువురు వాహనదారులు అర్థంకాక సతమతమవుతున్నారు.ఇంతకుముందు టొయోటా అర్బన్ క్రూయిజర్ యజమాని కూడా ఇదే పద్ధతిలో ఊరేగింపు చేపట్టారు.

Telugu Gurugram, Haryana, Kia Car, Latest-Latest News - Telugu

వివిధ కారు తయారీదారుల సేవలపై అసంతృప్తిగా ఉన్న అనేకమంది యజమానులు వినూత్న రీతిలో తమ నిరసనను తెలియజేశారు.ఫోర్డ్ ఎండీవర్, స్కోడా ఆక్టావియా, ఎంజీ హెక్టర్, హై-ఎండ్ లగ్జరీ, జాగ్వార్ ఎస్ఎఫ్ వంటి కార్లు కూడా అనేక విమర్శలకు గురైయ్యాయి.ఇప్పుడు కియా కారుపై జరుగుతున్న ప్రచారం నెట్టింట చక్కర్లు కొడుతుంది.హై-ఎండ్ లగ్జరీ కార్ల తయారీదారులు కూడా సంతోషంగా లేని కస్టమర్ల నుంచి తప్పించుకోలేక పోయారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube