అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కి దెబ్బ మీద దెబ్బ తగులుతోంది.ఇప్పటికే అభిశంసన తీర్మానంతో ట్రంప్ పదవిపై మల్ల గుల్లాలు పడుతుంటే తాజాగా అమెరికా మాజా భద్రతా సలహాదారు జాన్ బోల్టన్ రాసిన ఓ పుస్తకం పెను దుమారం రేపుతోంది.
డోనాల్డ్ ట్రంప్ పై ఇప్పటికే ప్రత్యర్ధి పార్టీ డెమొక్రాట్ అభిశంసన తో విరుచుకుపడుతున్న క్రమంలోనే తాజాగా మరొక అంశం జాన్ బయటకి తీసుకురావడంతో అమెరికా రాజకీయం మరింత హాట్ హాట్ గా మారిపోయింది.
అమెరికా మాజీ ఉపాధ్యక్షుడు జో బిడెన్, ఆయన కుమారుడిపై కుట్రలు పన్నుతూ ఉక్రెయిన్ పై తీవ్ర ఒత్తిడి తీసుకువచ్చారని జాన్ బయటపెట్టిన సందర్భంలోనే ఈ అభిశంసన తెరపైకిరాగా తాజాగా జాన్ మరొక కీలక విషయం బయటపెట్టడంతో ఇప్పుడు మరొక అస్త్రం డెమోక్రటిక్ పార్టీకి దొరికినట్టే అయ్యింది.ఇదిలాఉంటే
ట్రంప్ ఉక్రెయిన్ ని బెదిరించే క్రమంలోనే, జో బిడెన్ ఆయన కుమారుడిపై చర్యలు తీసుకోక పొతే ఉక్రెయిన్ కి ఆర్ధిక సాయం శాశ్వతంగా నిలిపివేస్తానని హెచ్చరించారని జాన్ తన పుస్తకంలో ప్రస్తావించారు.ఇప్పుడు ఈ వార్త ట్రంప్ ని మరింత ఇరకాటంలోకి నేట్టేలా ఉన్నాయి.బోల్టన్ స్వయంగా తన పుస్తకంలో ఈ విషయాలు తెలిపారని న్యూయార్క్ టైమ్స్ తన వ్యాసంలో ప్రచురించింది.ప్రస్తుతం అమెరికా ఎగువ సభలో అభిశంసన విచారాణ జరుగుతున్న నేపధ్యంలో ఈ వార్తలు రావడం ట్రంప్ కి పెద్ద తలనెప్పే అంటున్నారు పరిశీలకులు.