యువత అంటే అల్లరి చిల్లరగా తిరుగుతూ భవిష్యత్తు గురించి ఆలోచించరని చాలా మంది అనుకుంటూ ఉంటారు.కానీ ఈ వ్యక్తి మాత్రం అలా అనుకునే వారి ఆలోచనలను తారుమారు చేసాడు.
ప్రస్తుతం యువతకి ఆయన ఒక ఆదర్శం అనే చెప్పాలి.ఎన్నో ఒడిదుడుకులను తట్టుకుంటూ మెల్లమెల్లగా ఒక్కో మెట్టూ ఎక్కుతూ నెంబర్ 1 స్థానానికి ఎదిగి ప్రపంచ దృష్టిని తనవైపుకు తిప్పుకున్నాడు.
ఇంతకీ అతను ఎవరు అని ఆలోచిస్తున్నారా.? ఆయన మరెవరో కాదు ఎంతోమందికి ఆదర్శంగా నిలిచిన సుందర్ పిచాయ్.ఇది ఒక పేరు మాత్రమే అని అనుకుంటే పొరపాటు పడినట్లే.ఎందుకంటే సుందర్ పిచాయ్ అంటే పేరు కాదు ఒక బ్రాండ్.
ప్రపంచంలోనే అతి పెద్ద ఐటీ కంపనీకి సీఈఓ గా పని చేస్తున్నారు.సుందర్ పిచాయ్ చెన్నైకి చెందిన వ్యక్తి.
ప్రస్తుతం గూగుల్ యొక్క మాతృసంస్థ అయిన అల్ఫాబెట్‌కు సీఈవోగా రాణిస్తున్నారు.తాజాగా సుందర్ పిచాయ్ కు చెందిన ఒక ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ గా మారింది.
ఈ ఫొటోలో సుందర్ పిచాయ్ టీనేజర్ లుక్ లో చాలా హ్యాండ్సమ్ గా కనిపిస్తున్నారు.సుందర్ పిచాయ్ టీనేజ్ లో ఉన్నప్పుడు తన తల్లిదండ్రులతో కలిసి ఒక పర్యాటక ప్రాంతానికి వెళ్ళినప్పుడు అక్కడ దిగిన ఫోటోలా కనిపిస్తుంది.
టీనేజ్ లో ఉన్న సుందర్ పిచాయ్ ను చూసిన నెటిజన్లు ఆయనను గుర్తించలేపోతున్నారు.

సుందర్ పిచాయ్ కు చిన్నప్పటి నుండే సాదా సీదా జీవితం గడపడం అలవాటు.అద్దె ఇంట్లో ఉంటూ, రాత్రి పగలు మంచిగా చదువుకుని నంబర్ 1 పొజిషన్ కు వచ్చాడు సుందర్ పిచాయ్.అమెరికాలోని స్టాన్‌ఫోర్డ్ వర్సిటీలో ఎంఎస్ చేసి గూగుల్ లో చేరారు.
అలా అతని ప్రస్థానం మొదలయింది.ముఖ్యమైన క్రోమ్ బ్రౌజర్ ప్రాజెక్టు విజయవంతం అయ్యాక సుందర్ పిచాయ్ పేరు బాగా పాపులర్ అయ్యి కంపెనీలో వేగంగా ఎదిగారు.
ప్రస్తుతం ఆయన అల్ఫాబెట్ ప్రాజెక్టులకు సీఈఓ గా వ్యవహరిస్తున్నారు.టెక్నాలజీపై ఎంతో గ్రిప్ ఉండడంతో పాటు, చాలా సాధారణ మనిషిలాగా అందరితోనూ కలిసి మెలిసి ఉండడం, తోటి ఉద్యోగులకు సలహాలు, సూచనలు ఇస్తూ వారిలో స్ఫూర్తిని నింపడం లాంటి గుణాల వలనే ఆయన ఈరోజు ఈ స్థాయిలో ఉన్నారు అని ఆయన సన్నిహితులు.
కొన్ని సందర్భాల్లో చెబుతూ ఉంటారు.అలాంటి సుందర్ పిచాయ్ యొక్క టీనేజ్ ఫోటో ఒక్కసారిగా నెట్టింట్లో కనిపించేట ప్పటికి నెటిజన్లు ఆశ్చర్యంలో ఉండిపోయారు.
సుందర్ పిచాయ్ ఫోటో చూసిన నెటిజన్లు అందరు తమదైన శైలిలో కామెంట్స్ పోస్ట్ చేస్తున్నారు.