ఒక్కడు సినిమాలో విలన్ పాత్రని మిస్ చేసుకున్న హీరో ఎవరో తెలుసా...?

అప్పటి వరకు మహేష్ బాబు సినిమాలు చేస్తున్నాడు కానీ ఒక్క మురారీ తప్ప మంచి హిట్ మూవీ ఒకటి కూడా లేదు దీంతో ఒక మాస్ సినిమా తీయాలి అని కృష్ణ గారు అనుకొని గుణశేఖర్ దగ్గర ఉన్న కథ విన్నారు అది నచ్చి కృష్ణ గారు మహేష్ బాబు తో గుణశేఖర్ కి సినిమా ఇచ్చారు.అలా తీసిన ఒక్కడు సినిమా మహేష్ బాబు కెరియర్ లోనే ఫస్ట్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది.

 Do You Know Who Is The Hero Who Missed Out On The Villain Role In The Okadudu M-TeluguStop.com
Telugu Bhumika Chawla, Gunasekhar, Hand, Mahesh Babu, Okkadu, Prakash Raj, Tolly

అయితే ఈ సినిమాలో విలన్ గా ప్రకాష్ రాజ్ ఎంత అద్భుతంగా నటించాడో మనందరికీ తెలిసిందే…ఈ సినిమాలో ప్రకాష్ రాజ్ విలనిజానికి కొత్త వెరిషయన్ ఇచ్చారనే చెప్పాలి.మహేష్ బాబు ప్రకాష్ రాజ్ మధ్య ఢీ అంటే ఢీ అనే రేంజ్ లో పోటీ నడుస్తుంటుంది.అయితే ఈ సినిమా లో విలన్ గా ముందు గుణశేఖర్ గోపిచంద్ ని అనుకున్నారట కానీ గోపిచంద్ ఆ క్యారెక్టర్ నేను చేయలేను అని చెప్పడంతో ఆ క్యారెక్టర్ కి ప్రకాష్ రాజ్ నీ తీసుకున్నారు నిజం గా ప్రకాష్ రాజ్ ఆ క్యారక్టర్ కి తన నటన తో ప్రాణం పోశారనే చెప్పాలి.అయితే గోపిచంద్ ఈ సినిమా వదిలేయడానికి ఒక రీజన్ ఉంది ఏంటంటే అప్పటికే గోపిచంద్ తేజ డైరెక్షన్ లో మహేష్ బాబు చేస్తున్న నిజం సినిమాలో విలన్ గా చేస్తున్నాడు మళ్ళీ మహేష్ బాబు సినిమాలో విలన్ గా చేస్తే రొటీన్ అయిపోతుంది అనే ఉదేశ్యం తో తను ఈ క్యారెక్టర్ చేయలేను అని చెప్పినట్లు తెలుస్తుంది…

Telugu Bhumika Chawla, Gunasekhar, Hand, Mahesh Babu, Okkadu, Prakash Raj, Tolly

ఆ తర్వాత గోపిచంద్ వర్షం సినిమాలో విలన్ గా చేసి యజ్ఞం సినిమాతో హీరో అయ్యాడు…మొత్తానికి గోపిచంద్ చేయాల్సిన క్యారెక్టర్ ప్రకాష్ రాజ్ చేసి విలనిజం లో కొత్త షేడ్స్ తీసుకువచ్చాడు అనే చెప్పాలి…ఈ సినిమా లోనే కాకుండా ప్రకాష్ రాజ్ మహేష్ బాబు తో పోకిరి సినిమా లో కూడా విలన్ గా నటించి అలీ భాయ్ గా అందరి ప్రశంశలు అందుకున్నాడు…ఇక ఇది ఇలా ఉంటే ప్రస్తుతం మహేష్ బాబు త్రివిక్రమ్ తో సినిమా చేస్తున్నాడు ఒక్కడు సినిమా డైరెక్టర్ అయిన గుణశేఖర్ సమంత తో శాకుంతలం అనే సినిమా చేసి రిలీజ్ చేసే పనుల్లో ఉన్నాడు…

 Do You Know Who Is The Hero Who Missed Out On The Villain Role In The Okadudu M-TeluguStop.com
Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube