మనం ఏ పనిలో అయినా సక్సెస్ సాధించాలంటే ఆత్మ విశ్వాసం ముఖ్యమనే సంగతి తెలిసిందే.ఒక బుల్లితెర నటి ఎన్నో కష్టాలు ఎదురైనా అంచెలంచెలుగా ఎదుగుతూ కెరీర్ పరంగా సక్సెస్ సాధించారు.
చేతిలో చిల్లిగవ్వ లేక ఈ నటి ఎదుర్కొన్న కష్టాలు అన్నీఇన్నీ కావు.ఒకప్పుడు చెత్త ఏరుకున్న ఈ నటి ప్రస్తుతం బుల్లితెరపై స్టార్ స్టేటస్ తో ప్రశంసలు అందుకుంటున్నారు.
ఈ ప్రముఖ నటి పేరు దివ్యాంక త్రిపాఠి( Divyanka Tripathi ).యాంకర్, మోడల్ గా దివ్యాంక త్రిపాఠి గుర్తింపును సంపాదించుకున్నారు.2005 సంవత్సరంలో దివ్యాంక మిస్ భోపాల్( Miss Bhopal ) కిరీటాన్ని అందుకున్నారు.
బనీ మే తేరి దుల్హన్ సీరియల్ సక్సెస్ సాధించడంతో ఆమె కెరీర్ పరంగా వెనుదిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు.అయితే ఊహించని విధంగా తర్వాత రోజుల్లో ఆమెకు సీరియల్ ఆఫర్లు తగ్గాయి.చిన్నపాత్రలు కూడా రాకపోవడంతో ఆమె రోడ్డుపై చెత్త ఏరడం మొదలుపెట్టారు.
తప్పు పనులు చేస్తే ఆఫర్లు ఇస్తామని కొంతమంది చెప్పగా ఆమె మాత్రం అందుకు అంగీకరించలేదు.యే హై మొహబ్బతే సీరియల్( Yeh Hai Mohabbatein ) లో ఛాన్స్ రావడంతో పాటు ఆ సీరియల్ సక్సెస్ కావడంతో ఆమె పారితోషికం అమాంతం పెరిగింది.
దివ్యాంక పారితోషికం ప్రస్తుతం లక్ష నుంచి లక్షన్నర రూపాయల రేంజ్ లో ఉంది.
పలు టీవీ షోలలో దివ్యాంక త్రిపాఠి విన్నర్, రన్నర్ గా నిలిచారు. 2017 ఫోర్బ్స్ సెలబ్రిటీ జాబితా( 2017 Forbes Celebrity List )లో ఈ నటి చోటు సంపాదించుకున్నారు.కెరీర్ విషయంలో, వ్యక్తిగత జీవితంలో దివ్యాంక ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొన్నారు.2016 సంవత్సరంలో వివేక్ దహియా( Vivek Dahiya )ను పెళ్లి చేసుకున్నారు.అభిమానులు ఈ జంటను ప్రేమగా దివేక్ అని పిలుస్తారు.
దివ్యాంక త్రిపాఠి రాబోయే రోజుల్లో మరిన్ని విజయాలను సొంతం చేసుకుంటే బాగుంటుందని ఆమె మరిన్ని సంచలనాలను సృష్టించాలని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు.