మెగాస్టార్ చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య టైటిల్ సాంగ్ లిరిక్స్ పై వివాదం చెలరేగింది.సినీ గేయ రచయిత చంద్రబోస్, మోటివేషనల్ స్పీకర్ యండమూరి వీరేంద్రనాథ్ మధ్య మాటల తుటాలు పేలుతున్నాయి.
చంద్రబోస్ రాసిన టైటిల్ సాంగ్ పై యండమూరి వీరంద్రనాథ్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి.పాటలో సాహిత్యం అర్థం లేకుండా ఉందన్న ఆయన కొన్ని పదాలపై అభ్యంతరం వ్యక్తం చేశారు.
తిమిరనేత్రమై ఆవరించిన త్రినేత్రుడే అనే పంక్తిని ఉద్దేశిస్తూ తిమిరము అంటే అర్థం తెలుసా అని ప్రశ్నించిన యండమూరి ఎవరు రాశారో కానీ ఏమిటీ పిచ్చి రాతలు అంటూ ఫేస్ బుక్ వేదికగా పోస్ట్ చేశారు.ఈ క్రమంలో యండమూరి పోస్టుకు చంద్రబోస్ కు కౌంటర్ ఇచ్చారు.
అసలు తిమిరంలోని నిగూడార్థం తెలియని వారే అసలైన తిమిరమంటూ వ్యాఖ్యనించారు.