కాపు సంక్షేమ సేన వ్యవస్థాపకుడు, రాష్ట్ర అధ్యక్షుడు మాజీ మంత్రి చేగొండి హరిరామ జోగయ్య రిజర్వేషన్ల కోసమంటూ ఉద్యమానికి దిగారు.సీఎం జగన్ కు కాపులకు రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తూ లేఖ రాశారు.
అంతకుముందు.జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కు. తన మేనిఫెస్టోలో కాపు రిజర్వేషన్ అంశాన్ని ప్రస్తావించాలని కోరారు.కాపుల అభ్యున్నతి కోసమంటూ.
చాలా సార్లు మీటింగులు పెట్టారు.అంతే కాదు ఆయన మంత్రిగా ఉన్నప్పుడు కూడా రిజర్వేషన్ల కోసం పాటుపడ్డారు.
ఇదంతా ఒకప్పుడు ముచ్చట.ఆయన వయసు మీదపడటంతో.
చాలా కాలం సైలెంట్ అయిపోయారు.
పార్టీల కండువాలు మార్చుతున్నా.ఆయన వైఖరి మాత్రం మార్చుకోలేదు.85 ఏళ్ల వయసులోనూ ఆమరణ నిరాహార దీక్షకు దిగారు.ముద్రగడ పద్మనాభం లాంటి నేత అప్పట్లో నానా హైరానా చేసినా.ట్రైన్ తగలబెట్టిన కేసుతో ఆగిపోయారు.తర్వాత ఆయన ఆగిపోవడంతో.కేంద్రం సైతం సైలెంట్ అయిపోయింది.
గుజరాత్ లో పటేళ్లు, రాజస్థాన్ లో జాట్ లు, తెలంగాణలో ముస్లింలు ఇలా చాలా చోట్ల నినాదాలు రావడంతో.కేంద్ర ప్రభుత్వం ఏకంగా సుప్రీం కోర్టు తీర్పును పక్కన పెట్టి మరీ అగ్రవర్ణ పేదలకు 10 శాతం రిజర్వేషన్లు కల్పించింది.
85 ఏళ్లు నిండిన వయసులో తన జాతికోసమంటూ ఆమరణ నిరాహార దీక్షకు దిగడం.ఏ రాజకీయ ఫలాన్ని ఆశించి చేస్తున్నారనేది అర్థం కాని చిక్కు ప్రశ్నగా మారింది.చంద్రబాబు హయాంలో రిజర్వేషన్ల అంశం తెరమీదకు వచ్చినా.అప్పుడు సైలెంట్ అయిన కాపునేత ఇప్పుడు నిరాహార దీక్షకు దిగడం ఏంటని విశ్లేషకులు అనుమానిస్తున్నారు.చికిత్సను సైతం పక్కన పెట్టి దీక్షకు దిగడం.ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకే అని వైసీపీ నేతలు మండిపడుతున్నారు.
అంతే కాదు కాపులను జనసేన పార్టీకి చేరువ చేయడానికి జోగయ్య ప్లాన్ చేశారని సైతం మండిపడుతున్నారు.మరి నిజంగా హరిరామ జోగయ్య.
రాజకీయ లాభాన్ని ఆశించి దీక్షకు దిగారా.? లేదా అనేది తెలియాలంటే మరి కొన్ని రోజులు ఆగాల్సిందే
.