టాలీవుడ్ యంగ్ హీరో దగ్గుబాటి రానా ( Rana Dagggubati )నేచురల్ బ్యూటీ సాయి పల్లవి( Sai Pallavi ) హీరో హీరోయిన్లుగా డైరెక్టర్ వేణు ఊడుగుల దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు వచ్చినటువంటి చిత్రం విరాటపర్వం.నక్సలిజం బ్యాక్ డ్రాప్ లోతెరకెక్కిన ఈ సినిమా సరిగ్గా గత ఏడాది క్రితం విడుదలైంది నేటితో ఈ సినిమా విడుదలై ఓ సంవత్సరం పూర్తి చేసుకుంది.
ఈ క్రమంలోనే ఈ సినిమా తనకు పంచిన అనుభవాలను గురించి డైరెక్టర్ వేణు సోషల్ మీడియా వేదికగా చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
ఈ సందర్భంగా డైరెక్టర్ వేణు విరాటపర్వం సినిమా( Virataparvam ) గురించి మాట్లాడుతూ ఎన్నో విషయాలను తెలియచేశారు.ఈ సినిమాలో ఎలాంటి హంగు ఆర్భాటాలు లేకుండా తీయడంతో ప్రేక్షకులు పెద్దగా ఈ సినిమాని ఆదరించలేకపోయారు.దీంతో ఈ సినిమా ఘోర పరాజయం ఎదుర్కొంది.
అయితే ఈ సినిమా అందించిన ఫలితం తనకు ఎంతో కష్టతరంగా మారిందని అయితే ఈ సినిమా ఫలితం నుంచి తాను ఎన్నో విషయాలను నేర్చుకున్నాను అంటూ డైరెక్టర్ వేణు కామెంట్ చేశారు.
విరాటపర్వం సినిమా విడుదలకు ముందు నేను విడుదల తర్వాత నేను ఒకటి కాదు.విరాటపర్వం తనకు ఎన్నో అందమైన అనుభూతులను ఇచ్చింది.అదే సమయంలో మార్కెట్ కొట్టే దెబ్బ ఎలా ఉంటుందో కూడా చూపించిందని వేణు( Director Venu Udugula ) తెలిపారు.
ఈ సినిమా ఫలితం తనకు కాలి కింద మందు పాత్ర పేలినట్టు అనిపించేలా చేసిందని తెలిపారు.కొన్ని నెలలపాటు నిద్రలేని రాత్రులు గడిపానని ఈయన తెలియజేశారు.ఈ సినిమా ఫలితం నన్ను ఆలోచనలలో పడేసిందని తెలిపారు.ఏడాది పాటు నాలోని సృజనాత్మకతను నా వ్యక్తిత్వాన్ని మరింత అర్థం చేసుకోవడానికి ఈ సినిమా నాకు ఎంతో స్ఫూర్తిని కలిగించిందని అందుకే నాకు విరాటపర్వం సినిమా ఎప్పటికీ ఒక సెల్ఫ్ డిస్కవరీ లాంటిది అంటూ వేణు ఈ సందర్భంగా చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.