బీఆర్ఎస్, బీజేపీ అసలు స్వరూపం బయటపడిందని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు.గవర్నర్ తో సీఎం కేసీఆర్ కలిసి వెళ్లి అసలు స్వరూపాన్ని బయటపెట్టారని విమర్శించారు.
బీజేపీ, బీఆర్ఎస్ కలిసి నాటకాలు ఆడుతున్నాయని భట్టి ఆరోపించారు.ఇతర పార్టీల ఉనికి లేకుండా చేయాలని రెండు పార్టీలు కుట్రలు చేస్తున్నాయన్నారు.
సమాజానికి ప్రధాని మోదీ అత్యంత ప్రమాదకారిగా మారారన్న ఆయన కేసీఆర్ పాలనలో అంతా అవినీతి, అక్రమాలే ఉన్నాయని చెప్పారు.అందుకే నేతలు పెద్ద ఎత్తున కాంగ్రెస్ లో చేరడానికి సిద్ధమవుతున్నారని తెలిపారు.