చిరంజీవి స్టాలిన్ పోస్టర్ తో అద్భుతం సృష్టించిన ప్రశాంత్ వర్మ?

ప్రశాంత్ వర్మ( Prashanth Varma ) ఇటీవల ఈయన పేరు ఇండస్ట్రీలో మారుమోగిపోతుంది.యంగ్ డైరెక్టర్ గా ఇండస్ట్రీలో పలు సినిమాలకు దర్శకత్వం వహిస్తున్నటువంటి ప్రశాంత్ వర్మ ఇటీవల హనుమాన్( Hanuman ) సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.

 Director Prashanth Varma Interesting Comments About Chiranjeevi , Chiranjeevi, P-TeluguStop.com

ఈ సినిమా ఎలాంటి సక్సెస్ అందుకుందో మనకు తెలిసిందే.చైల్డ్ ఆర్టిస్ట్ గా ఇండస్ట్రీలో కొనసాగుతూ ఉన్నటువంటి తేజ సజ్జ( Teja sajja )హీరోగా హనుమాన్ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

ఈ ఏడాది జనవరి నెలలో సంక్రాంతి పండుగను పురస్కరించుకొని ఈ సినిమా విడుదల అయ్యి ఏకంగా 300 కోట్ల కలెక్షన్స్ రాబట్టి సంచలనాలను సృష్టించింది.అయితే ఈ సినిమాకు సంబంధించి ఎన్నో విషయాలను ఇటీవల వరుస ఇంటర్వ్యూలలో పాల్గొంటున్నటువంటి ప్రశాంత్ వర్మ తెలియజేస్తూ అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తున్నారు.అయితే తాజాగా ఈ సినిమాలో చిరంజీవిని స్ఫూర్తిగా తీసుకొని హనుమాన్ విగ్రహాన్ని ఆవిష్కరించామంటూ ఈయన చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.

ఈ సినిమాలో హనుమాన్ విగ్రహం చేతులు కట్టుకొని ఎంతో గంభీరంగా చూస్తూ ఉన్నట్టు కనపడుతుంది అయితే ఆ విగ్రహాన్ని చిరంజీవి( Chiranjeevi ) స్టాలిన్ సినిమాని ( Stalin Movie ) స్ఫూర్తిగా తీసుకొని చేశామని తెలిపారు.స్టాలిన్ సినిమాలో చిరంజీవి అలా చేతులు కట్టుకొని గంభీరంగా చూస్తూ ఉన్నటువంటి పోస్టర్ ఆధారంగా ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేశాము అంటూ ప్రశాంత్ వర్మ తెలియజేయడంతో ఈ వార్త కాస్త వైరల్ గా మారింది.ఈ విగ్రహంలో అంజేయ స్వామిని చూస్తే గూస్ బంప్స్ గ్యారెంటీ.

చిరంజీవి గారి పోస్టర్ ఆధారంగా దానిని రూపొందించాం.మేము అనుకున్న దానికంటే అద్భుతంగా వచ్చినట్లు ప్రశాంత్ వర్మ తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube