టాలీవుడ్ ఇండస్ట్రీలో సీనియర్ హీరోగా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి వారిలో నటుడు నరేష్ ( Naresh ) ఒకరు.ఈయన విజయనిర్మల వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి పలు సినిమాలలో హీరోగా నటించిన కమెడియన్ గా ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా వరుస సినిమాలలో నటిస్తూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు.
ఇకపోతే నరేష్ సినిమాల కంటే కూడా తన వ్యక్తిగత విషయాల ద్వారా పెద్ద ఎత్తున వార్తలలో నిలిచిన సంగతి మనకు తెలిసిందే.
నరేష్ ఇప్పటికే మూడు పెళ్లిళ్లు చేసుకొని ముగ్గురు భార్యలకు విడాకులు ఇచ్చిన సంగతి తెలిసిందే.ఇకపోతే పవిత్ర లోకేష్( Pavitra Lokesh )తో రిలేషన్లో ఉన్నారు.ఇక ఈ వ్యవహారం కాస్త సోషల్ మీడియాలో సంచలనంగా మారింది.
ఈ లేటు వయసులో ఘాటు ప్రేమలేంటి అంటూ వీరిపై భారీ స్థాయిలోనే ట్రోల్ చేశారు.అంతేకాకుండా వీరిద్దరూ కలిసి ఓ సినిమాలో హీరో హీరోయిన్లుగా కూడా నటించారు.
ఇలా పవిత్ర లోకేష్ తో కలిసి సహజీవనం చేస్తున్నటువంటి ఈయన ఇటీవల కాలంలో సోషల్ మీడియాకి కూడా కాస్త దూరమయ్యారు.
ఇకపోతే తాజాగా నరేష్ ట్విట్టర్ వేదికగా చేసినటువంటి పోస్ట్ ఒకటి వైరల్ అవుతుంది.బయట ఎండ తీవ్రత చాలా అధికంగా ఉందని ప్రజలందరూ కూడా ఆప్రమత్తంగా ఉండాలని తెలిపారు.చాలా ప్రాంతాలలో ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలు దాటాయని కేరవాన్ లో కూడా ఏసీలు పనిచేయడం లేదంటూ ఈయన తెలిపారు.
ఇక కొన్ని మూవీ షూటింగ్స్ కూడా ఆగిపోయాయని రానున్న రోజుల్లో మరింత ఎండ తీవ్రత ఉంటుందని జాగ్రత్తలు తెలిపారు.ఇలా ఈ పోస్ట్ చేయడమే కాకుండా ఆయన మరొక ఫోటోని షేర్ చేస్తూ.
జీవితం ఫర్ఫెక్ట్ గా లేదు అయినా మీరు పర్ఫెక్ట్ మూమెంట్స్ తో నింపండి అంటూ చేసినటువంటి పోస్ట్ చర్చలకు కారణమైంది బహుశా ఈయనకు పవిత్ర లోకేష్ తో కూడా గొడవలు మొదలయ్యాయి అంటూ కామెంట్లో చేస్తున్నారు.
.