తెలుగు సినీ ప్రేక్షకులకు డైరెక్టర్ సీ పరాన్జీ( Jayanth C Paranjee ) గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.తెలుగులో చాలా సినిమాలకు దర్శకత్వం వహించి దర్శకుడిగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకున్నారు.
ముఖ్యంగా ప్రేమించుకుందాం రా, బావగారూ బాగున్నారా వంటి ఫీల్ గుడ్ మూవీస్ తెరకెక్కించి ప్రేక్షకులను అలరించారు.అయితే చాలా కాలంగా ఆయన మరో ప్రాజెక్ట్ రూపొందించలేదు.
కాగా ఆయన దర్శకత్వం వహించిన చాలా సినిమాలు సూపర్ హిట్ కాగా మరికొన్ని సినిమాలు డిజాస్టర్ గా కూడా నిలిచాయి.అందులో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన తీన్ మార్( Teenmaar Movie ) ఒకటి.
దశాబ్ద కాలం కితం థియేటర్లలో విడుదలైన ఈ సినిమా పవర్ స్టార్ అభిమానులను నిరాశపరిచింది.అప్పట్లో మూవీ బాక్సాఫీస్ వద్ద బిగ్గెస్ట్ డిజాస్టర్ గా నిలిచింది.చాలా కాలంగా తెలుగు తెరకు దూరంగా ఉన్న జయంత్ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.ఈ సందర్బంగా తీన్ మార్ సినిమా ఫెయిల్ కావడంపై ఆసక్తికర కామెంట్స్ చేశారు.
తీన్ మార్ సినిమా రిజల్ట్ పక్కన పెడితే ఈ మూవీ స్టోరీ మాత్రం నాకిప్పటికీ ఒక ఫ్రెష్ లవ్ స్టోరీగానే అనిపిస్తుంది.అయితే ఆ మూవీ ఫెయిల్ కావడానికి కారణాలు ఏమై ఉండవచ్చు అంటే నేను చెప్పలేను.
నాకు తెలిసినంతవరకు పవర్ స్టార్ ఇమేజ్ కు ఇది సరిపోలేదు.కొంతమంది అభిమానులు నిరాశకు గురయ్యారు.
మరీ ముఖ్యంగా త్రిషకు( Trisha ) సోనూసూద్ తో( Sonusood ) పెళ్లి చేయడం,, ఆ తర్వాత ఆమె తిరిగి పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) వద్దకు రావడం వంటి సన్నివేశాలు వాళ్లకు అంతగా నచ్చలేదు.ఒకవేళ ఇదే చిత్రాన్ని అప్పుడున్న యువ హీరోల్లో ఎవరో ఒకరితో తీసి ఉంటే రిజల్ట్ మరోలా ఉండేదేమో అని చెప్పుకొచ్చారు సీ పరాన్జీ.కాగా తీన్మార్ సినిమా విషయానికి వస్తే.పవన్ ప్రధాన పాత్రలో నటించిన తీన్ మార్ సినిమాలో త్రిష, కృతి కర్బంద హీరోయిన్ లుగా నటించారు.బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్ నటించిన లవ్ ఆజ్ కల్ సినిమాకు రీమేక్ గా తీన్ మార్ రూపొందించారు.అయితే బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ అయిన ఈసినిమా మ్యూజిక్ పరంగా శ్రోతలను ఆకట్టుకుంది.