కాకరకాయ అంటే అందరికి ఇష్టం ఉండకపోవచ్చు.అందుకు కారణం దాని రుచే.
చేదుగా ఉంటుందనే ఈ కాలంవారు దీని వంక కూడా చూడరు.అందుకే దీన్ని ఇంగ్లిష్ లో Bitter Gourd అని అంటారు.
పోనీ ఇది శరీరానికి మంచిదని తెలియదా అంటే అలా కాదు.తెలిసినా, రుచి కోసం వదిలేస్తారు.
అలాంటివారు ఇది చదవండి.కాకరకాయ, కాకరకాయ రసం వలన కలిగే ఉపయోగాలు చూసైనా కొంత మార్పు వస్తుందేమో.
* కాకరకాయలో విటమిన్ ఏ, సి, బి1, బి2, బి3, ఉంటాయి.ఇక మినరల్స్ విషయానికి వస్తే కరోటేనైడ్స్, విసిన్, చరడిన్, పొటాషియం, జింక్, మంగనీజ్, ఇంకా మోమోర్దిన్ ఉంటాయి.
* కాకరకాయ కనుల ఆరోగ్యానికి చాలా మంచిది.విటమిన్ ఏ ఉండటం వలన కంటిచూపుని మెరుగుపరుస్తుంది.
బీటా కెరోటిన్ కూడా కలిగి ఉండటం వలన కనులకి మరింత మేలు చేకూరుస్తూ, సమస్యలని నివారిస్తుంది.
* బ్లడ్ షుగర్ లెవెల్స్ తగ్గించడం కాకరకాయ సులువుగా చేసే పని.టైప్ 2 డయాబెటిస్ ని అడ్డుకుంటుంది ఇది.అందుకే షుగర్ పేషెంట్స్ కి కాకరకాయ ఎక్కువగా సూచిస్తుంటారు న్యూట్రిషన్ నిపుణులు.
* బరువు తగ్గాలనుకునేవారు రోజూ కాకరకాయ తీసుకుంటే మేలు.కాలరీలు తక్కువ కలిగిన కాకర బరువు తగ్గాలనుకునేవారికి గొప్ప వారం లాంటిది అని చెప్పుకోవచ్చు.
* యాంటిఆక్సిడెంట్స్ బాగా కలిగిన కాకరకాయ రోగనిరోధకశక్తిని బాగా పెంచుతుంది.రోజు ఉదయాన్నే కాకరకాయ తాగే అలవాటే ఉండాలి కాని, బ్యాక్టీరియా, ఇన్ఫెక్షన్స్ మనదగ్గరకి రావడానికి కూడా జంకుతాయి.
* బ్యాడ్ కొలెస్టిరాల్ లెవెల్స్ గణనీయంగా తగ్గిస్తుంది కాకరకాయ.LDL Cholesterol బాధితులంతా కాకరికాయను ఆశ్రయిస్తే మంచిది.
* ఒంట్లో టాక్సిన్స్ ని కూడా సులువగా కడిగిపడేస్తుంది కాకరకాయ.అందుకే రోజు పొద్దున్నే కాకరకాయ జ్యూస్ తాగమని చెప్పేది.
* అతిమద్యం వలన్న హ్యాంగోవర్ వస్తే గనుక కాకరకాయ రసం తాగండి చాలు.హ్యాంగోవర్ పారిపోకపోతే అడగండి.