మెగాస్టార్ సినిమాలో రవితేజ..ఏం సినిమానంటే?

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి చేతిలో ప్రస్తుతం నాలుగు సినిమాలు ఉన్నాయి.కొరటాల శివ దర్శకత్వంలో ‘ఆచార్య‘ సినిమా చేస్తున్నాడు.

 Director Bobby Megastar Chiranjeevi Movie Latest Update,chiranjeevi, Director Bo-TeluguStop.com

ఈ సినిమా ఎప్పుడో విడుదల అవ్వాల్సి ఉండగా కరోనా కారణంగా షూటింగ్ వాయిదా పడడంతో ఈ సినిమా అనుకున్న సమయానికి విడుదల కాలేకపోయింది.ఈ సినిమాలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా కీలక పాత్ర పోషిస్తున్నాడు.

చిరంజీవి ఆచార్య సినిమా తర్వాత మెహర్ రమేష్ దర్శకత్వంలో భోళా శంకర్ సినిమా, మోహన్ రాజా దర్శకత్వంలో గాడ్ ఫాదర్ సినిమాలు ప్రకటించాడు.ఇప్పటికే గాడ్ ఫాదర్ సినిమా షూటింగ్ స్టార్ట్ అయ్యి శరవేగంగా జరుగుతుంది.

ఇక ఆచార్య సినిమా కూడా దాదాపు షూటింగ్ పూర్తి చేసుకుంది.ఆచార్య పూర్తి అవ్వగానే భోళా శంకర్ సినిమాను సెట్స్ మీదకు తీసుకు వెళ్లేందుకు చిరంజీవి ప్లాన్ చేస్తున్నాడు.

Telugu Acharya, Bhola Shankar, Chiranjeevi, Bobby, God, Latest, Ravi Teja-Movie

ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా అనుకున్న సమయానికే ప్రాజెక్ట్స్ పూర్తి చేయాలనీ చిరు షూటింగ్ శరవేగంగా పూర్తి చేయడానికి తనవంతు కృషి చేస్తున్నాడు.ఇక ఈ సినిమా తర్వాత చిరంజీవి బాబీ దర్శకత్వంలో ఒక సినిమా చేయనున్నాడు.ఇప్పటికే వీరి కాంబోలో సినిమా వస్తున్నట్టు అధికారికంగా ప్రకటన వచ్చేసింది.ఇక చిరు తన సినిమాలను పూర్తి చేసుకున్నాక బాబీ సినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది.

Telugu Acharya, Bhola Shankar, Chiranjeevi, Bobby, God, Latest, Ravi Teja-Movie

అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఒక అప్డేట్ బయటకు వచ్చింది.బాబీ దర్శకత్వంలో చిరంజీవి చేయబోయే సినిమాలో ఒక కీలక పాత్ర ఉందట.ఈ పాత్ర కోసం చిత్ర యూనిట్ మాస్ రాజా రవితేజ ను సంప్రదించినట్టు తెలుస్తుంది.అయితే ఇంకా చర్చల దశలోనే ఉందట.ఈ పాత్రకు రవితేజ అంగీకరిస్తే అధికారికంగా ప్రకటించే అవకాశాలు ఉన్నాయి.చిరు సినిమాలో రవితేజ నటిస్తే ఇటు మెగా అభిమానులతో పాటు అటు రవితేజ అభిమానులు కూడా ఫుల్ ఖుషీ అవుతారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube