సాహసం చేయరా డింభకా అంటూ ‘మాయాద్వీపం’, అక్టోబరు 3 నుండి

అనగనగా ఒక ద్వీపం.ఆ ద్వీపం పేరు వింటేనే చలి జ్వరం వస్తుంది.కాళ్ళు ముందుకు అడుగు వేయడానికే సహకరించవు.పశు పక్షాదులు కూడా దూరని కారడివి.ఆ ద్వీపంలో అడుగడుగునా ఆటంకాలు.ఒకవేళ ఆ ఆటంకాలను ఛేదించుకుంటూ సొరంగమార్గంలో వెళితే పాతాళలోకం చేరుకుంటారు.

 Dimbhaka Says 'mayadveepam', From October 3, Mayadveepam , From October 3 , Zee-TeluguStop.com

అక్కడ ఉంది ఒక అద్భుత ద్వీపం.ఈ కథ అంతా ఎక్కడో విన్నట్టు, చూసినట్టుంది కదా? ఎందుకంటే ఈ కథ మన ‘మాయాద్వీపం’ కథ.అవును, మన ఎంతో ప్రియమైన జీ తెలుగు 7 ఏళ్ళ తర్వాత ఈ షో ని మరోసారి అందరిముందుకు తేనుంది.అంతేనా, తెలుగు టెలివిజన్ కు అన్నయ్య అయినా ఓంకార్ ఈ షో ద్వారా మళ్లీ మన చానల్ కి వస్తున్నారు.

ఆయనతోపాటు మన అందరికి ఎంతో ఇష్టమైన పిల్లమర్రిరాజు, ఒంటి కన్ను రాక్షసుడు ఈ ఆదివారం, అంటే అక్టోబర్ 3 నుంచి రాత్రి 9:00 గంటలకు మన ముందుకు వస్తున్నారు.

ఏడేళ్ల క్రితమే మాయాద్వీపం సెట్స్ ని అందరూ ఎంతో మెచ్చుకున్నారు.

అది మళ్లీ మన ముందుకు వస్తుంది అంటే ఛానల్, ఓంకార్ టీం సెట్స్ ని ఇంకెంత ఘనంగా తీర్చిదిద్ది ఉండొచ్చు.అవునండి – తెలుగు టెలివిజన్ లో కనీవిని ఎరుగనంతగా, మునుపెన్నడూ ఏ నాన్-ఫిక్షన్ టీం చేయని విధంగా మాయాద్వీపం సెట్ ఉండబోతుంది.

‘న భూతో న భవిష్యత్’ అనేంత రీతిలో ఉండబోతుంది.అలా అంగరంగ వైభవంగా సెట్స్ ఉండడానికి 100 మంది టెక్నీషియన్స్ 50 రోజులు పైగా పగలు రాత్రి కష్ట పడి, మన కోసం ఎంతో వైవిధ్యమైన సెట్స్ ని రూపాందించారు.

మాయాద్వీపం యాంకర్, ప్రొడ్యూసర్ ఓంకార్ మాట్లాడుతూ, మాయాద్వీపం నా డ్రీమ్ ప్రాజెక్ట్.నేను ఫస్ట్ టైం ప్రొడ్యూసర్ గా మారింది ఈ షో తోనే.ఈ షో ఇచ్చిన ధైర్యం తోనే ఎన్నో షోస్ ని నిర్మించాను.ఇప్పుడు ఏడేళ్ల తర్వాత మళ్లీ నేను ఈ షో ని అందరిముందుకు తీసుకొస్తున్నందుకు ఎంతో ఆనందంగా ఉంది.

అంతకుమించి, అందరికి ఎంతో ఇష్టమైన ‘పిల్లమర్రిరాజు’ మరియు ‘ఒంటి కన్ను రాక్షసుడు’ ని మరోసారి అందరి ముందుకు తీసుకొస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది.అంతే కాకుండా, అభిమానులందరినీ మరోసారి మాయా ప్రపంచం లోకి తీసుకెళ్లేందుకు అద్భుతమైన సెట్స్ ని డిజైన్ చేయడం జరిగింది.

ఇలాంటి సెట్స్ ఇప్పటివరకు ఏ తెలుగు టెలివిజన్ నాన్-ఫిక్షన్ షో లో చూసి ఉండరు.అలాగే, ప్రోమో చూసిన తర్వాత వచ్చిన స్పందన చాలా ఆనందాన్ని కలిగించింది.

ఈ షో అందరికి నచ్చుతుందని, ఇప్పుడున్న పిల్లలకి కూడా మేము ఇంకా దగ్గరవుతామని భావిస్తున్నాను.

ఈ షోకి కంటెస్టెంట్స్ గా 6 – 12 ఏళ్ళ చిన్నారులు రావడం జరుగుతుంది.

ఈ పిల్లలని డిజిటల్ ఆడిషన్స్ పద్థతిలో సెలక్ట్ చేయడం జరిగింది.మాయాద్వీపం ఆడిషన్స్ అనగానే 12000 + పైగా ఎంట్రీస్ పంపారు.

ఆడిషన్స్ ఈ లెవెల్లో ఉంటే మరి ఆట ఎలా ఉంటుందో ఊహించండి.ప్రతి ఎపిసోడ్ కి నలుగురు కొత్త కంటెస్టెంట్స్.

ఆ నలుగురిలో ఎవరు చాకచక్యంగా, వారి తెలివితేటలతో, జ్ఞాపకశక్తి తో పాతాళ లోకం చేరుకొని ఒంటి కన్ను రాక్షసున్ని సంహరిస్తారో వారికే ‘అద్భుతదీపం’ దక్కుతుంది.చదువుతుంటే చూడాలి అనిపిస్తుంది కదా? మరి ఇంకా ఎందుకు ఆలస్యం, జీ తెలుగులో ఈ ఆదివారం ‘మాయాద్వీపం’ చూసేయ్యండి.

ప్రోమో – https://www.youtube.com/watch?v=N4x5pryTixc

ఈ ఆదివారం అక్టోబర్ 3 రాత్రి 9:00 గంటల నుండి ప్రసారం కానుంది అద్భుతమైన ‘మాయాద్వీపం’ మీ జీ తెలుగు లో.డోంట్ మిస్ ఇట్.

ఈ కార్యక్రమాన్ని ఎంజాయ్ చేయడానికి జీ తెలుగుని సబ్ స్క్రైబ్ చేసుకోండి.జీ తెలుగు ప్రైమ్ ప్యాక్ నెలకు 20 రూపాయలు మాత్రమే.

మీ అభిమాన జీ తెలుగు కార్యక్రమాల్ని మిస్ అవ్వకండి.జీ తెలుగు, జీ సినిమాలతో పాటు జీ నెట్ వర్క్ కు చెందిన 7 టాప్ ఛానెల్స్ తో ఉన్న జీ ప్రైమ్ ప్యాక్ ను ఎంచుకోండి.

నెలకు కేవలం 20 రూపాయలకు మీ కుటుంబమంతటికీ కావాల్సిన వినోదాన్ని అందించే ప్యాక్.మరిన్ని వివరాలకు మీ దగ్గర్లోని డీటీహెచ్ లేదా కేబుల్ ఆపరేటర్ ను సంప్రదించండి.

జీ తెలుగు గురించి

జీ ఎంటర్టైన్మెంట్ ఎంటర్ ప్రైజెస్ లిమిటెడ్ (ZEEL)కు చెందిన జనరల్ ఎంటర్ టైన్ మెంట్ ఛానెల్ జీ తెలుగు.2005 మే 18న ప్రారంభమైన జీ తెలుగు ఛానల్ తో సౌతిండియాలో ఎంటరైంది ఈ సంస్థ.దేశవ్యాప్తంగా ఉన్న 75 మిలియన్ తెలుగు ప్రేక్షకులకు ప్రతి వారం వివిధ రకాల వినోద కార్యక్రమాల్ని అందిస్తోంది జీ తెలుగు.ఫిక్షన్ షోస్ నుంచి రియాలిటీ షోస్, టాక్ షోస్ వరకు వివిధ రకాల కార్యక్రమాలతో అల్టిమేట్ ఎంటర్టైన్ మెంట్ డెస్టినేషన్ గా అందరితో గుర్తింపు తెచ్చుకుంది.

విలక్షణమైన స్టోరీలైన్స్ తో ఫిక్షన్ కార్యక్రమాలు, అదిరిపోయే నాన్-ఫిక్షన్ షోస్, అదిరిపోయే ఫార్మాట్స్ లో ఈవెంట్స్ తో పాటు అన్ని వర్గాల వారిని అలరించే టాలీవుడ్ బిగ్గెస్ట్ మూవీస్ శాటిలైట్ హక్కుల్ని దక్కించుకొని.అద్భుతమైన కంటెంట్ ను అందిస్తోంది జీ తెలుగు.

సమతూకంగా ఉండే కంటెంట్ తో పాటు విభిన్నమైన కార్యక్రమాలతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో టాప్ జీఈసీ ఛానెల్ గా కొనసాగుతోంది జీ తెలుగు.అన్ని కేబుల్ మరియు డిజిటల్ వేదికలపై జీ తెలుగు పూర్తిస్థాయిలో విస్తరించి ఉంది.

ఇప్పుడు జీ5లో కూడా లభ్యమౌతోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube