టాలీవుడ్ లో స్టార్ హీరో పవన్ కళ్యాణ్ ఇమేజ్ ఎ స్థాయిలో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.ఆయన సినిమా అంటే అదిరిపోయే పంచ్ డైలాగ్స్, మంచి యాక్షన్ సీక్వెన్స్ కచ్చితంగా ఉండాల్సిందే.
వీటిలో పవన్ కళ్యాణ్ మేనరిజమ్స్ హైలెట్ అవ్వాల్సిందే.అలా ఉంటే పవన్ కళ్యాణ్ ని అతని ఫాన్స్ ఎక్కువగా వోన్ చేసుకుంటారు.
అలాంటి కథలు అయితేనే పవన్ కళ్యాణ్ తో వంద కోట్లు ఈజీగా కలెక్ట్ చేయొచ్చు.దిల్ రాజు ఇదే స్ట్రాటజీ హీరోల విషయంలో ఎప్పుడు కమర్షియల్ అంశాలు కచ్చితంగా ఫాలో అవుతూ సినిమాలు చేస్తూ ఉంటాడు.
ఇదిలా ఉంటే ఇప్పుడు హిందీలో అమితాబ్ కీలక పాత్రలో నటించిన పింక్ సినిమాని తెలుగులో రీమేక్ చేస్తున్నారు.నిజానికి ఈ సినిమాకి అమితాబ్ హిందీలో ప్రాణం పోసాడు.
మతిమరుపు ఉన్న వృద్ధ లాయర్ పాత్రలో జీవించాడు.ఇక ఇందులో కోర్టు ఎపిసోడ్స్ లో ఉండే ఎమోషన్స్ చాలా కీలకంగా ఉంటాయి.
ఆ ఎమోషన్స్ వలెనే సినిమా సక్సెస్ అయ్యింది.అమ్మాయిలకి జరిగిన అన్యాయాన్ని ఏ మాత్రం సామర్ధ్యం లేని ఒక వృద్ధ లాయర్ ఎలా వాదించాడు అనే పాయింట్ మేజర్ హైలైట్.
అయితే పవన్ కళ్యాణ్ తో ఈ సినిమాని రీమేక్ చేయడం వలన దిల్ రాజు పూర్తిగా కథా గమనాన్ని మార్చేసి పవన్ కళ్యాణ్ కి సరిపోయే కమర్షియల్ అంశాలైన డైలాగ్స్, ఫైట్స్ మిక్స్ చేసి సినిమాని చేస్తున్నట్లు తెలుస్తుంది.దీనికోసం పవన్ కళ్యాణ్ పై ప్రత్యేకంగా యక్షం సన్నివేశాలు కూడా చిత్రీకరిస్తున్నారు.
అయితే ఒరిజినల్ కథలో ఉండే సోల్ అయిన ఎమోషన్ మిస్ అయితే దిల్ రాజు విపరీతమైన ప్రయోగం మొదటికే మోసం అవుతుంది.మరి ఈ విషయంలో దిల్ రాజు టీం ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంది అనేది చూడాలి.