నాగచైతన్య సమంత (Naga chaithanya-Samantha) గురించి ప్రతిరోజు ఏదో ఒక వార్త వస్తుంది అని చెప్పడంలో అతిశయోక్తి ఉండదు.ఎందుకంటే వీరి గురించి ఇప్పటికే ఎన్నో వార్తలు సోషల్ మీడియాలో వినిపించాయి.
అంతేకాదు వీరు విడాకులు తీసుకోవడానికి కారణం కూడా సోషల్ మీడియాలో వచ్చిన పుకార్లే అంటూ నాగచైతన్య ఓ ఇంటర్వ్యూలో కూడా బయట పెట్టారు.అయితే సమంత నాగచైతన్య విడాకులకు కారణం నాగచైతన్య వేరే హీరోయిన్లతో ఎఫైర్లు పెట్టుకోవడం అని ఒక వార్త వినిపిస్తే.
సమంత పెళ్లయ్యాక కూడా ఎక్స్పోజింగ్ లు చేస్తూ సినిమాలు చేయడం వల్లే అక్కినేని ఫ్యామిలీ ( Akkineni Family ) కి నచ్చక ఇద్దరి మధ్య గొడవలు వచ్చాయనేది మరో వార్త ప్రచారంలో ఉంది.

ఇక ఈ రెండింటిలో ఏది నిజమో ఏది అబద్దమో తెలియదు కానీ ఓ సినిమా టైం లో జరిగిన ఒక సంఘటన సమంతను ఎంతగానో బాధ పెట్టిందట.ఈ సంఘటన వల్లే సమంత నాగచైతన్యతో తరచూ గొడవ పెట్టుకునేదని మరో వార్త సోషల్ మీడియాలో వినిపిస్తోంది.అసలు విషయం ఏమిటంటే.
సమంత,నాగచైతన్య,దివ్యాంశ కౌశిక్ ప్రధాన పాత్రల్లో వచ్చిన మజిలీ ( Majili ) సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

ఈ సినిమాలో సమంతతో కాకుండా నాగచైతన్య కు మరో హీరోయిన్ అయిన దివ్యాంశ కౌశిక్ ( Divyansha kaushik ) తో రొమాంటిక్ సీన్స్, లిప్ కిస్ లు ఉంటాయి.అయితే ఇది సినిమా వరకైతే బాగానే ఉంటుంది.కానీ సినిమా షూటింగ్ తర్వాత కూడా నాగచైతన్య దివ్యాంశ కౌశిక్ ప్రవర్తన గమనిస్తున్న సమంతకి ఎక్కడో డౌట్ కొట్టిందట.
దాంతో అసలు విషయం తెల్సుకుంటే వీరిద్దరి మధ్య సీక్రెట్ ఎఫైర్ నడుస్తోందని సమంత ( Samantha ) కు అర్థమైందట.ఈ విషయాన్ని నేరుగా నాగచైతన్యని అడిగేసరికి ఆయన ఈ విషయాన్ని ఒప్పుకోలేదట.
దాంతో అప్పటినుండి గొడవలు వచ్చి విడాకుల వరకు వెళ్లారని నెట్టింట్లో వార్తలు వినిపిస్తున్నాయి.