సినిమా అంటే కేవలం హీరో హీరోయిన్ ఉంటె సరిపోదు కదా.సినిమా రక్తి కట్టాలంటే అందుకు తగ్గట్టుగా అనేక పాత్రలు ఉండాలి.
సైడ్ క్యారెక్టర్స్ కూడా ఒక్కోసారి సినిమాను నిలబెడతాయి.ముఖ్యంగా కమెడియన్స్ అయినా సినిమాను వారి భుజాల మీద మోస్తరు.
ఆలా కమెడియన్స్ వల్ల చాల సినిమాలు హిట్ అయ్యాయి.ఇక ఇప్పుడు ఇండస్ట్రీ లో లేడీ కమీడియాన్స్ చాల తక్కువ మంది ఉన్నారు కానీ 80’s, 90’s లో ఆ కొరత ఉండేది కాదు.
చాల మంది లేడీ కామెడియన్స్( Lady comedians ) సినిమాల్లో నటించేవారు.అయితే అలా కొంత మంది సినిమాల్లోకి వచ్చిన స్టార్ డాం దొరక్క ఇండస్ట్రీ నుంచి పక్కకు వెళ్ళిపోతారు.

అలాంటి వారిలో అనుజా రెడ్డి ( Anuja Reddy )అనే లేడీ కమెడియన్ కూడా ఒకరు.ఈ పేరు చెప్తే ఎవరికి గుర్తు రాదు కానీ ఫోటో చూస్తే మాత్రం త్వరగానే గుర్తు పట్టేస్తారు.తెలుగు లో బ్రహ్మానందం( Brahmanandam ) సరసన అనుజా ఎక్కువ సినిమాల్లో నటించారు.ముఖ్యంగా చంటి సినిమాలో బ్రహ్మానందం అనుజా రెడ్డి భార్య భర్తలు గా చేసిన కామెడీ ఎవరు మర్చిపోలేరు .అనుజా రెడ్డి స్వస్థలం గుంటూరు అయినా కూడా ఆమె కుటుంబం చెన్నిల్లోనే స్థిరపడింది.ఒకసారి అనుజా ఉండే వీధిలో షూటింగ్ జరిగితే అది చూడటానికి వెళ్లిన ఆమెను ఆ సినిమా బృందం సినిమాల్లోకి తీసుకోచ్చారు.
అలా 14 ఏళ్ళ వయసులో మలయాళ సినిమా ఇండస్ట్రీ ద్వారా మొట్టమొదట పరిచయం అయినా అనుజా తమిళ్ మరియు తెలుగు లో కొన్నాళ్ల పాటు బాగానే నటించింది.

తెలుగు లో అయితే కమెడియన్ రోల్స్, కాస్త వాంప్ పోలికలు ఉండే రోల్స్ చేయడం తో ఆమెకు సరైన అవకాశాలు రాలేదు.దాంతో కొన్నాళ్ళకు సినిమా ఇండస్ట్రీ నుంచి వెళ్ళిపోయి చెన్నై లో పెళ్లి చేసుకొని సెటిల్ కాగా ఈమెకు ఒక కుమారుడు కూడా ఉన్నాడు.ఇప్పుడు సినిమాల్లో నటించక పోయిన కూడా ఒక వెల్ నెస్ సెంటర్ లో ఆమె ఉద్యోగం చేస్తుంది.
మళ్లి అనుజా రెడ్డి సిల్వర్ స్క్రీన్ పై మెరవాలని చూస్తున్న ఎవరు అవకాశాలు ఇవ్వడం లేదు.ఇటీవల ఒక తమిళ మీడియా సంస్థకు ఇంటర్వ్యూ ఇచ్చిన అనుజా ఆమె మనోగతాన్ని పంచుకున్నారు.