పాతికేళ్ల క్రితమే పవన్ కళ్యాణ్ నా సినిమాని రిజెక్ట్ చేశారు... వర్మ కామెంట్స్ వైరల్!

తెలుగు సినిమా ఇండస్ట్రీలో సంచలనాత్మక డైరెక్టర్ గా గుర్తింపు పొందిన రాంగోపాల్ వర్మ( Ramgopal Varma ) ఈ మధ్యకాలంలో పవన్ కళ్యాణ్ అభిమానులను,పవన్ కళ్యాణ్ ( Pawan Kalyan )బాగా టార్గెట్ చేశారని తెలుస్తోంది.తనకు వీలు కుదిరినప్పుడల్లా పవన్ కళ్యాణ్ గురించి తన స్టైల్ లో పలు వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలుస్తున్నారు.

 Pawan Kalyan Rejected My Film Years Ago, Ramgopal Varma, Pawan Kalyan, Jd Chakra-TeluguStop.com

అయితే ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి రాంగోపాల్ వర్మ తనకు పవన్ కళ్యాణ్ అభిమానులను గిల్లడం అంటే చాలా ఇష్టం అంటూ చేసినటువంటి కామెంట్స్ వైరల్ అయ్యాయి.ఈ విధంగా తరచూ ఏదో ఒక వివాదాస్పద వ్యాఖ్యల ద్వారా ఈయన వార్తల్లో నిలుస్తున్నారు.

Telugu Jd Chakravarthy, Pawan Kalyan, Ramgopal Varma, Tollywood, Varaprasad, Vin

ఇదిలా ఉండగా తాజాగా రాంగోపాల్ వర్మ పవన్ కళ్యాణ్ తన సినిమాని రిజెక్ట్ చేశారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.అయితే పాతిక సంవత్సరాల క్రితమే నేను చెప్పిన కథకు పవన్ కళ్యాణ్ నో చెప్పారంటూ ఈయన చేసినటువంటి కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.పాతిక సంవత్సరాల క్రితం తాను పవన్ కళ్యాణ్ వద్దకు వెళ్లి ఓ సినిమా కథ చెప్పాను.అయితే ఈ సినిమా తాను చేయనని పవన్ కళ్యాణ్ రిజక్ట్ చేశారు అంటూ వర్మ తెలిపారు.

జెడి చక్రవర్తి( JD Chakravarthy ) , వినీత్ ( Vineeth) హీరోలుగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం వైఫ్ ఆఫ్ వరప్రసాద్( Wife Of Varaprasad ) ఈ సినిమాకు వంశీ దర్శకుడుగా వ్యవహరించారు.

Telugu Jd Chakravarthy, Pawan Kalyan, Ramgopal Varma, Tollywood, Varaprasad, Vin

ఇక ఈ చిత్రాన్ని రాంగోపాల్ వర్మ నిర్మించడం విశేషం అయితే ఈ సినిమా కథతో పవన్ కళ్యాణ్ వద్దకు రాంగోపాల్ వర్మ వెళ్ళగా ఆయన ఈ సినిమాని రిజెక్ట్ చేశారట.ఒకానొక సమయంలో పవన్ కళ్యాణ్ కూడా ఇదే విషయం గురించి మాట్లాడారు వర్మ గారితో నాకు ఏ విధమైనటువంటి విభేదాలు లేవు ఒకసారి ఆయన సినిమా చేయమని వస్తే తాను రిజెక్ట్ చేశాను అంతకుమించి వేరే విభేదాలు ఏమీ లేవని తెలిపారు.అయితే ప్రస్తుతం పవన్ కళ్యాణ్ వారాహి యాత్రలో( Varahi Yatra ) భాగంగా తనకు ఓట్లు వేసి గెలిపించాలని ప్రజలను అడగడంతో పవన్ కళ్యాణ్ అలా అడుక్కోవడం తన ఇష్టం లేదని ఆయన ఎప్పుడు హీరోగానే ఉండాలి కానీ జీరో కాకూడదు అంటూ పవన్ పై వర్మ చేస్తున్నటువంటి ఈ కామెంట్స్ సంచలనంగా మారాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube