పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్( Prabhas ) ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నారు.వచ్చే నెలలో సలార్ సినిమా ద్వారా పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.
ఈ సినిమాతో పాటు ఈయన తదుపరి సినిమాల షూటింగ్ పనులలో కూడా ఎంతో బిజీగా ఉన్న విషయం మనకు తెలిసిందే.ఇక ప్రభాస్ వైజయంతి మూవీస్ బ్యానర్ లో డైరెక్టర్ నాగ్ అశ్విన్ ( Nag Aswin ) దర్శకత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో తెరకు ఎక్కబోతున్నటువంటి కల్కి( Kalki )సినిమాలో కూడా నటిస్తున్న సంగతి మనకు తెలిసిందే.
ఇప్పటికే ఈ సినిమా నుంచి గ్లింప్ వీడియో విడుదల చేశారు.ఈ వీడియో సినిమాపై భారీ అంచనాలనే పెంచేసాయి.

ప్రాజెక్టుకే అనే వర్కింగ్ టైటిల్ తో షూటింగ్ పనులను జరుపుకుంటున్నటువంటి ఈ సినిమాకు తాజాగా టైటిల్ తో పాటు గ్లింప్ వీడియో విడుదల చేయడంతో సినిమాపై భారీగానే అంచనాలు పెరిగిపోయాయి.ఈ సినిమా పాన్ వరల్డ్ స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రాబోతుందని సమాచారం ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా షూటింగ్ పనులను జరుపుకుంటుంది.ఈ సినిమాలో బాలీవుడ్ నటి దీపిక పదుకొనే( Deepika Padukone ) హీరోయిన్గా నటించగా అమితాబ్ బచ్చన్( Amithb Bachchan ) కమల్ హాసన్( Kamal Hassan ) వంటి స్టార్ సెలబ్రిటీలు ఈ సినిమాలో భాగం అయ్యారు.

ఇదిలా ఉండగా తాజాగా ఈ సినిమాకి సంబంధించిన ఓ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ప్రభాస్ ఈ సినిమాకు ఫస్ట్ ఛాయిస్ కాదనే వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.నాగ్ అశ్విన్ ఈ సినిమా కోసం ముందుగా ప్రభాస్ ను ఏమాత్రం ఊహించుకోలేదట ఈ సినిమా అనుకున్న సమయంలో ఆయన మైండ్లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్( Ram Charan )మాత్రమే స్ట్రైక్ అయ్యారట అయితే చరణ్ ని కలిసి ఆయనకు ఈ సినిమా స్టోరీ వినిపించిన తర్వాత చరణ్ తనకు ఈ సినిమాలో నటించడం కుదరదని తేల్చి చెప్పారట.
అయితే అప్పటికే ఈయన రాజమౌళి RRR సినిమాతో బిజీగా ఉన్న నేపథ్యంలోనే ఈ అవకాశాన్ని వదులుకున్నారని తెలుస్తోంది.ఇక ఈ విషయం తెలిసినటువంటి రామ్ చరణ్ ఫాన్స్ బంగారం లాంటి ఛాన్స్ మిస్ చేసుకున్నారని ఎంతో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.







