టి 20 వరల్డ్ కప్ లో ఆడనున్న ధోని.?

ఐపీఎల్ సీజన్ 17 లో భాగంగా ప్రతి టీం తమ తమ జట్టుని విజయతీరాలకు చేర్చడంలో చాలావరకు సక్సెస్ సాధిస్తున్నారు.ఇక కొన్ని జట్లు దురదృష్టవశాత్తు ఓడిపోతున్నప్పటికీ ఎక్కువ శాతం టీమ్ లు మాత్రం గెలుపుని లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగుతున్నాయి.

 Dhoni Will Play In T20 World Cup Details, Dhoni ,t20 World Cup , Mahendra Singh-TeluguStop.com

మరి ఇలాంటి క్రమంలో ప్రస్తుతం ఉన్న టీమ్ లు విజయాన్ని సాధిస్తాయా లేదా అనే విషయాలు తెలియాల్సి ఉంది.

ఇక ఇదిలా ఉంటే ప్రస్తుతం చెన్నై టీము( Chennai Team ) అద్భుతమైన విజయాలను కొనసాగిస్తుంది.

ఇక టీం లో ఉన్న ప్లేయర్లు అందరూ ఒకేత్తు అయితే మహేంద్రసింగ్ ధోని( Dhoni ) మాత్రం చివర్లో అద్భుతమైన ఫినిషింగ్ టచ్ ఇస్తున్నాడు.చివర్లో ఆయన ఆడేది నాలుగైదు బంతులు అయినా సరే వాటిలో మూడు నాలుగు సిక్సులను కొట్టి ముందుకు దూసుకెళ్తున్నాడు.

మరి ఇప్పుడు ధోని మంచి ఫామ్ లో ఉన్నాడు.

కాబట్టి సోషల్ మీడియాలో ధోని అభిమానులు t20 వరల్డ్ కప్పులో( T20 World Cup ) ధోని ఆడితే బావుంటుంది అంటూ వాళ్ళ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు.నిజానికి ధోని ఈ సంవత్సరంతో అన్ని ఫార్మాట్లకు రిటర్మెంట్ ప్రకటిస్తున్నాడు.ఇక ఇప్పటికే అన్ని ఫార్మాట్లలో రిటైర్మెంట్ ప్రకటించినప్పటికీ ఐపీఎల్లో మాత్రం కంటిన్యూస్ గా ఆడుతున్నాడు.

ఇక ఈ సంవత్సరం ఐపిఎల్ కి ( IPL ) కూడా రిటర్మెంట్ ప్రకటించి చెన్నై టీమ్ తరుపున కోచ్ గా కీలక భాద్యతలు తీసుకోబోతున్నట్టుగా తెలుస్తుంది.

మరి ఇలాంటి క్రమంలో ఆయన ఆట తీరును చూసి యంగ్ ప్లేయర్లు సైతం ఆయన ఆట ముందు దిగదుడుపే అంటూ ఆయన అభిమానులు చాలా సంబరపడిపోతున్నారు….మొత్తానికైతే ధోని తన స్టామినాని నిరూపిస్తూ వింటేజ్ ధోనిని తలపిస్తున్నాడనే చెప్పాలి.మరి అభిమానుల ఆశ మేరకు ధోని టి20 వరల్డ్ కప్ లో ఆడే అవకాశం ఏదైనా ఉందేమో చూడాలి…

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube