టాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ దేవి శ్రీప్రసాద్ గురించి మనందరికీ తెలిసిందే.తెలుగులో ఎన్నో సినిమాలకు అద్భుతమైన పాటలను అందించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు దేవి శ్రీ ప్రసాద్.
అంతేకాకుండా తెలుగు సినీ ఇండస్ట్రీలో బాగా డిమాండ్ ఉన్న మ్యూజిక్ డైరెక్టర్లలో దేవిశ్రీప్రసాద్ కూడా ఒకరు.సీనియర్ హీరోలు టాప్ హీరోలకు ఫస్ట్ ఛాయిస్ దేవి శ్రీ ప్రసాద్ అని చెప్పవచ్చు.
ఇకపోతే పుష్ప సినిమా పాటలతో ప్రపంచాన్ని ఊపేసాడు దేవిశ్రీప్రసాద్.పాటలకు తగ్గట్టుగా కూడా వాటిని తెరకెక్కించిన విధానం మరింత ఆకట్టుకుంది.
ఇక పుష్ప సినిమా విడుదల అయ్యి కొన్ని నెలలు కావస్తున్న ఆ సినిమా మేనియా ఇంకా తగ్గలేదు అంటే మీరే అర్థం చేసుకోవచ్చు.
ఇది ఇలా ఉంటే పుష్ప సినిమా పాటలు తాజాగా హీరోయిన్ కేతిక శర్మ పాడింది.
రొమాంటిక్ సినిమాతో తన అందంతో యూత్ ని ఆకట్టుకున్న కేతిక శర్మ ఈ సినిమా అంతగా ఆడకపోయినప్పటికీ తన అందాలతో యూత్ ని కట్టి పడేసింది.ఇకపోతే ప్రస్తుతం హీరో వైష్ణవ తేజ్ హీరోగా నటించిన రంగ రంగ వైభవంగా సినిమాతో ప్రేక్షకులను పలకరించడానికి సిద్ధంగా ఉంది.
ఈ క్రమంలోనే ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా సందడి సందడి చేసింది కేతిక శర్మ.రంగ రంగ వైభవంగా సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా కేతిక శర్మ పుష్ప సినిమాలోని పాట పాడింది.
పుష్ప లోని శ్రీవల్లి పాటను అద్భుతంగా పాడింది.
కాగా ఈ వీడియో కాస్త దేవీ శ్రీ ప్రసాద్ కంట పడింది.
కేతిక పాటను పాడిన విధానానికి దేవీ శ్రీ ప్రసాద్ ఫిదా అయ్యారు.అయితే మామూలుగానే సెలెబ్రిటీలతో పాటలు పాడిస్తుంటాడు డీఎస్పీ.మరి కేతిక తోనూ పాటను పాడిస్తాడేమో చూడాలి.ఆ వీడియోని చూసిన దేవి శ్రీ ప్రసాద్ ఎంతో ఎక్స్‌ప్రెస్సివ్‌గా పాడిందంటూ కేతిక పై ప్రశంసలు కురిపించాడు దేవీ శ్రీ ప్రసాద్.
కాగా ప్రస్తుతం దేవీ శ్రీ ప్రసాద్ పుష్ప ది రూల్ సినిమా కోసం పనిచేస్తూ అందుకు సంబంధించిన విషయాలలో బిజీబిజీగా గడుపుతున్నారు.అయితే మ్యూజిక్ సిట్టింగ్స్ అయ్యాయని, మూడు పాటలు కూడా కంపోజ్ చేశానని అన్నాడు.
రెండో పార్ట్ స్క్రిప్ట్ అదిరిపోయిందని దేవీ శ్రీ ప్రసాద్ చెప్పిన మాటలు నెట్టింట్లో బన్నీ అభిమానులకు ఫుల్ కిక్కిచ్చేశాయి.మరి పార్ట్ వన్ లో విడుదలైన పాటలు దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఎంతటి విజయాన్ని సాధించాయో మనందరికీ తెలిసిందే.
దేవి శ్రీ ప్రసాద్ మాటలను బట్టి చూస్తే పుష్ప పార్ట్ 2 లోని పాటలు అంతకుమించి ఉండబోతున్నట్టు తెలుస్తోంది.