బుల్లితెర కార్యక్రమాలలో సందడి చేస్తూ ప్రస్తుతం వెండితెర అవకాశాలను అందుకొని వరుస సినిమాలతో ఎంతో బిజీగా గడుపుతున్న వారిలో సుడిగాలి సుదీర్ ఒకరు.ఈ విధంగా సుడిగాలి సుదీర్ టాలీవుడ్ ఇండస్ట్రీలో బిజీగా ఉన్నారు అంటే అందుకు కారణం జబర్దస్త్ కార్యక్రమం అని చెప్పాలి.
జబర్దస్త్ కార్యక్రమం ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న సుదీర్ తిరిగి ఈ కార్యక్రమాన్ని వదిలి ఇతర ఛానల్లో సందడి చేయడమే కాకుండా వరుస సినిమాలలో సందడి చేస్తూ బిజీగా ఉన్నారు.
ఇక ఇన్ని రోజులపాటు సుడిగాలి సుదీర్ ఈటీవీలో జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ, ఢీ వంటి కార్యక్రమాలలో సందడి చేశారు.
ఈ క్రమంలోనే తాజాగా ఈటీవీ వార్షికోత్సవ కార్యక్రమంలో భాగంగా సుడిగాలి సుదీర్ అనసూయ చమ్మక్ చంద్ర వంటి వారందరినీ కూడా తిరిగి తీసుకువచ్చారు.ఇలా ఈటీవీలో సుధీర్ కనిపించడంతో అభిమానులు సైతం ఎంతో సంతోషం వ్యక్తం చేశారు.
ఇలా ఈటీవీలో సందడి చేసిన ఈయన తిరిగి జబర్దస్త్ లోకి కూడా రాక మానరు అంటూ ఆశాభావం వ్యక్తం చేశారు.

ఇక ఈటీవీ వార్షికోత్సవంలో భాగంగా పలువురు కమెడియన్లు హైపర్ ఆది పై దారుణంగా సెటైర్లు వేస్తూ తనని అవమానపరిచారు.అలాగే ఈ కార్యక్రమంలో భాగంగా సుదీర్ చేసిన స్కిట్లను నామమాత్రానికే చూపించారు.ఆయన చేసిన స్కిట్ పూర్తిగా ఎడిట్ చేసి చూపించడంతో పలువురు అభిమానులు ఈటీవీ వారిపై ఫైర్ అవుతున్నారు.
వార్షికోత్సవం పేరుతో సుడిగాలి సుదీర్ ని తిరికి ఈటీవీకి పిలిచి ఇలా ఆయనను దారుణంగా అవమాన పరుస్తున్నారు అంటూ పెద్ద ఎత్తున కామెంట్లు చేస్తున్నారు.మొత్తానికి సుడిగాలి సుదీర్ పై మల్లెమాల వారు ఈటీవీ వారు ఇలా పగ తీర్చుకున్నారు అంటూ అభిమానులు మండిపడుతున్నారు.







