టాలీవుడ్ యంగ్ హీరో నాగ శౌర్య గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.ప్రస్తుతం టాలీవుడ్ లో ఉన్న మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్ లో నాగశౌర్య కూడా ఒకరు.
ఇది కొద్దికాలం మాత్రమే.ఎందుకంటే నాగశౌర్య త్వరలోనే వైవాహిక జీవితంతో ఒక ఇంటివాడు కాబోతున్నాడు.
ఈనెల 20వ తేదీన 11:25 లకు వివాహ బంధంతో వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టబోతున్నాడు నాగశౌర్య.ఇప్పటికే నాగశౌర్య పెళ్లికి సంబంధించిన పనుల్లో ప్రారంభమయ్యాయి.
అంతేకాకుండా పెళ్లి పత్రికలను పంచడం కూడా స్టార్ట్ చేశారు.
ఇకపోతే నాగశౌర్య పెళ్లికి సంబంధించిన వార్తలు జోరుగా వినిపిస్తుండడంతో పలువురు అభిమానులు ఇంతకీ వధువు ఎవరు అమ్మాయి ఏం చేస్తుంది? ఎలా ఉంటుంది ఈ విషయాలన్నీ తెలుసుకోవడానికి ఆసక్తిని చూపిస్తున్నారు.మరి నాగశౌర్య పెళ్లి చేసుకోబోయే ఆ వధువు ఎవరో ఇప్పుడు మనం తెలుసుకుందాం.ఆమె పేరు అనూష శెట్టి. ఆమె కర్ణాటక చెందిన అమ్మాయి.అనూష శెట్టి మంగళూరు సమీపంలోని కుందాపూర్ లో నివసిస్తోంది.
కాగా ఆమె ఒక ప్రముఖ ఇంటీరియర్ డిజైనర్.అంతేకాకుండా ఉమెన్స్ అచీవర్స్ లో ఒకరిగా గుర్తింపు సంపాదించుకుంది అనూష శెట్టి.
2019 -20 సంవత్సరాల ఆర్కిటెక్గా బెస్ట్ డిజైనర్ ఆఫ్ ది ఇయర్ అవార్డును సైతం సొంతం చేసుకుంది.కాగా గత కొంతకాలంగా నాగో శౌర్యకు అనుష శెట్టికి పరిచయం ఉందని తెలుస్తోంది.వారి పరిచయం ప్రేమగా మారడంతో ఇరువురి పెద్దలు అంగీకరించినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.అంతేకాకుండా అనూష శెట్టి కి బెంగళూరులో అనూష శెట్టి ఒక డిజైన్స్ సంస్థ కూడా ఉందట.
ఎంతో లగ్జరీ రెసిడెన్షియల్ ఇంటీరియర్ డిజైన్ చేయడంలో వారు ప్రత్యేకం వార్తలు వినిపిస్తున్నాయి.కొత్తగా నాగశౌర్య ఒక ఇంటివాడు కాబోతున్నాడు అన్న వార్త వినిపించడంతో అభిమానులు అతనికి పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.