దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దూకుడు పెంచింది.ఇందులో భాగంగా ఈ కేసులో అరెస్ట్ అయిన మనీశ్ సిసోడియా, అరుణ్ పిళ్లైలను ఈడీ విచారిస్తుంది.
మనీలాండరింగ్ కేసులో భాగంగా మనీశ్ సిసోడియాను తీహార్ జైలులో విచారిస్తున్నారు.కాగా మద్యం కుంభకోణంలో సిసోడియా ఏ1గా ఉన్న సంగతి తెలిసిందే.
అటు అరుణ్ పిళ్లైను ఈడీ కార్యాలయంలో అధికారులు ప్రశ్నిస్తున్నారు.సౌత్ గ్రూప్ కు సంబంధించి కూపీ లాగుతున్నారు.ఈ క్రమంలోనే రూ.100 కోట్ల ముడుపుల వ్యవహారంపై అధికారులు ఆరా తీస్తున్నారు.