బీసీసీఐ ప్రతిష్టాత్మకంగా ప్రతియేడాది నిర్వహించే ఐపిఎల్ ఈసారి యూఏఈ వేదికగా మొదలవ్వనున్నది.ఇంకా ఐపీఎల్ స్టార్ట్ అవ్వకముందే క్రికెట్ ఫాన్స్ హడావిడి మొదలైపోయింది.
ఐపీఎల్ టీమ్స్ లో మినిమమ్ నలుగురు విదేశీ ప్లేయర్స్ కు మాత్రమే అనుమతి ఉంది.కరోనా టైం కావడంతో కోట్లు పెట్టీ కొనుగోలు చేసిన ఈ ప్లేయర్స్ లో చాలామంది ఈసారి ఐపిఎల్ కు అందుబాటులో ఉండటంలేదు దీనితో ఆ టీమ్స్ ప్రత్యామ్నాయా లపై దృష్టి సారించాయి.
చాలా ఐపీఎల్ టీమ్స్ లో విదేశీ ఆటగాళ్ళు కీలకం కాని ఢిల్లీ క్యాపిటల్స్ లో వీరి పాత్ర చాలా పరిమితంగా ఉంది.ఎందుకంటే ఇందులో భారత్ అప్ కమింగ్ ప్లేయర్స్ మరియు భారత్ తరుపున ఆడుతున్న ప్లేయర్స్ ఎక్కువగా ఉన్నారు.
కావున ఈసారి ఢిల్లీ ఫైనల్ జట్టులో ముగ్గురు విదేశీయులు ఉండే ఛాన్స్ ఎక్కువగా ఉందని క్రికెట్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
ఈసారి ఐపీఎల్ లో ఢిల్లీ విజయం సాధిస్తుందని చాలామంది భావిస్తున్నారు దానికి కారణం ఈ జట్టులో చాలామంది టాలెంటెడ్ ప్లేయర్స్ ఉన్నారు.
ఈసారి ఢిల్లీకి సారథ్యం వహిస్తున్న శ్రేయాస్ ను క్రికెట్ సీనియర్స్ చాలామంది దీక్షణంగా పరిశీలిస్తున్నారు.మరి సీనియర్స్,నిపుణుల అంచనాలను ఈసారి ఢిల్లీ అందుకోగలదా లేదా అనేది వేచి చూడాలి.