రోజుల వ్యవధిలో యూఏఈ వేదికగా స్టార్ట్ కానున్న ఐపీఎల్ కరోనా కోరలలో చిక్కకుండా ఉండడం కోసం బీసీసీఐ ఎన్నో కట్టుదిట్టమైన భద్రత చర్యలను ఏర్పాటు చేసింది.కాని అవి ఫలితాన్ని ఇవ్వలేదు దాని ఫలితంగానే చెన్నై సూపర్ కింగ్స్ టీం కరోనా బారిన పడింది.
ఇక తాజాగా కరోనా నుండి కోలుకున్న చెన్నై సూపర్ కింగ్స్ ప్రస్తుతం ప్రాక్టీస్ లో బిజీగా ఉన్నారు.
అయితే తాజాగా నమోదవుతున్న కరోనా కేసులలో ఎక్కువశాతం లక్షణాలు పెద్దగా కనిపించడం లేదు.
ఇదే ఇప్పుడు ఐపీఎల్ టీమ్స్ యాజమాన్యాలను తెగ భయపెడుతున్నాయి.ఈ భయాన్ని జయించడానికి తాజాగా ఎంఐ, ఓ సరికొత్త ప్రయత్నం చేసింది.
అందులో భాగంగా ముంబై ఇండియన్స్ తమ ఆటగాళ్లకు స్మార్ట్ ఉంగరాలను బహూకరించింది.దీని ద్వారా ఆటగాళ్ల గుండె వేగం, శ్వాసలో హెచ్చుతగ్గులు, శరీర ఉష్ణోగ్రతలకు సంబంధించిన సమాచారాన్ని స్వేకరించవచ్చని ముంబై ఇండియన్స్ అభిప్రాయపడుతుందట.
సెప్టెంబర్ 19న మొదలవ్వనున్న ఐపీఎల్ కోసం బీసీసీఐ మరిన్ని రక్షణ చర్యలను చేపడుతుంది.జట్లు కూడా తమ ప్లేయర్స్ లో మానసిక స్థైర్యం నింపేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తున్నాయి.
మరి అవి ఎంత ప్రభావం చూపుతాయో వేచి చూడాలి.