టాలీవుడ్ రౌడి హీరోగా తనకంటూ ఒక ప్రత్యేకమైన బ్రాండ్ సెట్ చేసుకున్న యువ హీరో విజయ్ దేవరకొండ మొదటిసారి టోటల్ సౌత్ ఆడియెన్స్ ని టార్గెట్ చేశాడు.డియర్ కామ్రేడ్ సినిమాతో అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకర్షించాలని ప్రమోషన్స్ కూడా గట్టిగానే చేశాడు.
భరత్ కమ్మ దర్శకత్వంలో తెరకెక్కిన డియర్ కామ్రేడ్ తెలుగు – తమిళ్ – మలయాళం – కన్నడ భాషల్లో నేడు గ్రాండ్ గా రిలీజ్ అయ్యింది.సినిమా ఎలా ఉందొ రివ్యూలో పరిశీలిద్దాం.
నటీనటులు: విజయ్ దేవరకొండ – రష్మీక మందన్నా, శృతి రామ చంద్రన్, జయప్రకాష్, బ్రహ్మాజీ తదితరులుదర్శకత్వం: భరత్ కమ్మానిర్మాణం: మైత్రి మూవీ మేకర్స్ – బిగ్ బెన్ ప్రొడక్షన్ యష్ రంగినేనిసంగీతం: జస్టిన్ ప్రభాకరన్
కథ: కమ్యూనిస్ట్ బావలున్నా బాబీ (విజయ్ దేవరకొండ) ఒక కాలేజ్ స్టూడెంట్.మంచి నాయకత్వ లక్షణాలు ఉన్నప్పటికీ కాస్త ఆవేశం గల కుర్రాడు.
స్టూడెంట్ లీడర్ గా కొనసాగుతున్న సమయంలో బాబికి లిల్లీ(రష్మీక మందన్నా) కనిపిస్తుంది.లిల్లీ క్రికెట్ ప్లేయర్ గా అందరిని ఆకర్షిస్తుంది.
అయితే ఆమెను ఇష్టపడిన బాబీ అతి కష్టం మీద ఆమెను ఊహించని విధంగా లవ్ లోకి దింపుతాడు.ఈ క్రమంలో ఊహించని అనుభవాలు ఇద్దరి మధ్య దూరం పెంచుతాయి.
బాబీ ఆవేశం లిల్లీకి చేదు అనుభవాన్ని కలిగిస్తాయి.బాబీ భవిష్యత్తులో ఒక్కసారిగా మరో మార్పు.
ఆ తరువాత అతనికి ఎదురైన సమస్యలు ఏంటి? లిల్లీ ఆ తరువాత ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది? చివరకు బాబీ తన సమస్యలను ఎలా పరిష్కరించుకుంటాడు అనేది తెరపై చూడాల్సిందే.
నటీనటుల నటన:
కమ్యూనిస్టు బావలున్నా ఒక కాలేజ్ కుర్రాడిలా విజయ్ దేవరకొండ బాబీ పాత్రకు పూర్తిగా న్యాయం చేశాడు.ఎప్పటిలానే కథను తన భుజాలపై మోసి ఒక లెవెల్ కి తీసుకెళ్లాడు.ప్రతి సినిమాలో డిఫరెంట్ పాత్రలతో మెప్పించే విజయ్ ఈ సారి గత చిత్రం అర్జున్ రెడ్డి పాత్రను గుర్తు చేస్తాడు.
అయినప్పటికీ విజయ్ ఫ్యాన్స్ కి అది నచ్చుతుంది.ఇక రష్మీక మందన్నా పాత్ర కూడా సినిమాలో మరొక హైలెట్.ఒక ఉమెన్ క్రికెటర్ గానే కాకుండా ఇష్టపడిన అబ్బాయి ముందు అంధమైన ఆడపిల్లగా చక్కని కెమిస్ట్రీ క్రియేట్ అయ్యేలా చేసింది.బ్రహ్మాజీ – రావ్ రమేష్ ఎప్పటిలానే వారి అనుభవ నటనతో సినిమాకు హెల్ప్ చేశారు.శృతి రామచంద్రన్ కూడా జయ పాత్రతో మెప్పించారు.
టెక్నీకల్ గా:
దర్శకుడి ఉహ స్క్రీన్ పై కరెక్ట్ గా కనిపించాలి అంటే కెమెరామెన్ పనితనం బావుండలి.ఈ విధానంలో పలు సన్నివేశాలు కరెక్ట్ గా క్లిక్కయ్యాయి అంటే సినిమాటోగ్రఫీని మెచ్చుకొని తీరాల్సిందే.కెమెరెమెన్ సుజిత్ సారాంగ్ ఆ విషయంలో మంచి మార్కులే కొట్టేశాడు.ఇక దర్శకుడు భరత్ కాలేజ్ సీన్స్ ని బాగానే ప్రజెంట్ చేశాడు గాని మిగతా సీన్స్ లో కాస్త తడబడినట్లు అనిపించింది.ఇక బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో జస్టిన్ ప్రభాకరన్ సినిమా మూడ్ ని ప్రతి ఎపిసోడ్ లో కొత్తగా ఎలివేట్ చేశారు.
సాంగ్స్ తో పాటు లొకేషన్స్ కూడా బాగున్నాయి.సెకండ్ హాఫ్ సీన్స్ లో ఎడిటర్ ఇంకొన్ని జాగ్రత్తలు తీసుకొని ట్రిమ్ చేసుంటే బావుండేది.
విశ్లేషణ: సినిమా సినిమాకు చాలా ప్రత్యేకత ఉండాలని విజయ్ దేవరకొండ తీసుకునే కేరింగ్ గురించి స్పెషల్ గా చెప్పనవసరం లేదు.దర్శకులకు ఫుల్ ఫ్రీడమ్ ఇస్తూనే తనలో ఉన్న ఆలోచలనతో సినిమాకు ప్లస్ అయ్యేలా జాగ్రత్తపడతాడు.
ఇప్పుడు కూడా తన సెలెక్షన్ తో మెప్పించాడు.అయితే అర్జున్ రెడ్డి అనంతరం విజయ్ మరో డిఫరెంట్ అగ్రేసివ్ బాయ్ గా కనిపించాడు.
విజయ్ ఫ్యాన్స్ ని ఇది ఆకట్టుకున్నప్పటికి మిగతా ఆడియెన్స్ కి నచ్చడం అనుమానమే.ఇక దర్శకుడు భరత్ కమ్మ మొదటి సినిమాతోనే తన మేకింగ్ స్టయిల్ ఏంటో చూపించాడు.
కాలేజ్ సీన్స్ సినిమాలో న్యాచురల్ గా ఆకట్టుకుంటాయి.కథలో కొత్తదనం లేకపోయినా దర్శకుడు చాలా వరకు సీన్స్ ని హావభావాలతో డిఫరెంట్ గా తెరకెక్కించాడు.రష్మీక – విజయ్ ల కెమిస్ట్రీ మంచి ఫీల్ ను కలిగిస్తాయి.అయితే ఇంటర్వెల్ కి ఆడియెన్స్ కి పెద్దగా ఆసక్తిగా అనిపించదు.కొన్ని సీన్స్ సినిమా మూడ్ ని చేంజ్ చేస్తాయి.ఇక సెకండ్ హాఫ్ లో కూడా అక్కడక్కడా స్లోగా సాగుతున్న భావన కలుగుతుంది.
కానీ క్లయిమాక్స్ సీన్ మాత్రం ఎమోషనల్ గా హార్ట్ కి టచ్ అవుతుంది.లిల్లీ కెరీర్ కి సంబంధించిన సీన్స్ అలాగే కోర్టు సీన్ ఆకట్టుకుంటాయి.
అప్పుడే టైటిల్ జస్టిఫికేషన్ అని చెప్పవచ్చు.టోటల్ గా సినిమా నిడివి ఎక్కువవ్వడంతో స్లో నరేషన్ సినిమాకు ఎలాంటి టాక్ ని అందిస్తుందో చూడాలి.ఇక బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో పాటు పాటలను తెరకెక్కించిన విధానం బావుంది.
ప్లస్ పాయింట్స్:
విజయ్ నటనవిజయ్ – రష్మీక ల మధ్య సాగే కెమిస్ట్రీక్లయిమ్యాక్స్ ఎమోషనల్ సీన్స్
మైనస్ పాయింట్స్:
స్లోగా సాగే కొన్ని ఎపిసోడ్స్రెగ్యులర్ స్టోరీ ఫార్మాట్
రేటింగ్: 3/5
బాటమ్ లైన్: విజయ్ అండ్ వన్ వూమెన్ షో
.