చంద్రబాబు నాయుడు(Chandrababu Naidu) అరెస్ట్ కావడంతో ఎంతోమంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు తెలుగుదేశం నేతలు సినీ ఇండస్ట్రీకి సంబంధించినటువంటి వారు కూడా చంద్రబాబు నాయుడు అరెస్టు విషయాన్ని తీవ్రంగా ఖండిస్తున్నారు.ఇలా చంద్రబాబు నాయుడు అరెస్ట్ కావడంతో ఇండస్ట్రీకి చెందినటువంటి పలువురు నిర్మాతలు కూడా ఈ విషయంపై స్పందిస్తూ అధికార ప్రభుత్వంపై నిప్పులు జరుగుతున్నారు.
కేవలం కక్ష సాధింపు చర్యలు భాగంగానే చంద్రబాబుని అరెస్టు చేశారు అంటూ కూడా పలువురు నిర్మాతలు ఈ విషయంపై స్పందించిన విషయం మనకు తెలిసిందే.
తాజాగా ప్రముఖ నిర్మాత సురేష్ బాబు (Suresh Babu)సైతం చంద్రబాబు నాయుడు అరెస్ట్ విషయం గురించి మాట్లాడుతూ చేసినటువంటి కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో సంచలనంగా మారాయి.
తాజాగా ఈయన సప్త సాగరాలు దాటి సినిమా( Sapta Saagaralu Daati Movie ) ప్రెస్ మీట్ కార్యక్రమంలో పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో భాగంగా ఒక మీడియా ప్రతినిధి సురేష్ బాబుని ప్రశ్నిస్తూ చంద్రబాబు నాయుడు అరెస్టు విషయం గురించి మీ అభిప్రాయం ఏంటి అని ప్రశ్నించారు.
ఈ ప్రశ్నకు ఈయన సమాధానం చెబుతూ రాజకీయాలలోకి మమ్మల్ని లాగొద్దు అంటూ షాకింగ్ సమాధానం చెప్పారో.
ఇలాంటి విషయాలు గురించి మాట్లాడటానికి మేము పొలిటీషియన్స్ కాదు అలాగే మీడియా వాళ్ళము కూడా కాదు మేము కేవలం సినీ నిర్మాతలు మాత్రమే మేము సినిమాలు చేసుకునే వాళ్ళు కానీ ఇలా రాజకీయాల గురించి ఎలాంటి అభిప్రాయాలను నిర్ణయాలను తెలియజేసే వాళ్ళం కాదు.సినిమా ఇండస్ట్రీ అంటేనే ఎలాంటి రాజకీయాలు లేకుండా ఉండాలని అందుకే తాను ఈ విషయం గురించి మాట్లాడదలచుకోలేదని తెలిపారు.
ఇక మా తండ్రి రామానాయుడు గారు( Ramanaidu ) తెలుగుదేశం పార్టీ కోసం పనిచేశారు నేను కూడా పార్టీ కోసం పని చేసాను కానీ ఇప్పుడు నేను నిర్మాత సురేష్ బాబుని మాత్రమేనని ఈ సందర్భంగా సురేష్ బాబు చంద్రబాబు నాయుడు అరెస్టు విషయం గురించి మాట్లాడుతూ ఆ విషయంలోకి మమ్మల్ని లాగొద్దు చేసినటువంటి ఈ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.ఇలా ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి కూడా చంద్రబాబు నాయుడుకి అంతంత మాత్రమే మద్దతు ఉండడంతో పలువురు ఈ విషయంపై భారీ స్థాయిలో విమర్శలు కురిపిస్తున్నారు.
ఇక ఈ విషయంపై నిర్మాత అశ్వినీ దత్, మురళీమోహన్, బండ్ల గణేష్ వంటి వారు మాత్రమే స్పందించారు కానీ మిగిలిన ఎవరు కూడా ఈ విషయంపై స్పందించిన దాఖలాలు ఎక్కడా కనిపించలేదు.ఇక సురేష్ బాబు ఫిలిం ఛాంబర్ అధినేతగా నిర్మాతగా ఇండస్ట్రీలో ఎంతో మంచి సక్సెస్ అందుకున్న విషయం మనకు తెలిసిందే.ఈయన ప్రస్తుతం పలు సినిమాలను నిర్మిస్తూ నిర్మాతగా ఎంతో బిజీగా ఉన్నారు.