ఇటీవల కాలంలో చాలా మంది స్త్రీలు రొమ్ము క్యాన్సర్ బారిన పడుతూ నరకయాతన అనుభవిస్తున్నారు.అందులోనూ వయసు పైబడిన వారిలో ఈ సమస్య మరీ అధికంగా కనిపిస్తోంది.
చిన్న వయసులోనే రజస్వల కావడం, అధిక బరువు, సంతాన లేమి, ముప్పై ఏళ్ల తర్వాత సంతానం కలగడం, రేడియేషన్, హార్మోన్ ఛేంజస్, పలు రకాల మందుల వాడకం, మెనోపాజ్, జీవన శైలిలో మార్పులు, ఆహారపు అలవాట్లు.ఇలా రకరకాల కారణాల వల్ల రొమ్ము క్యాన్సర్ వ్యాధికి గురవుతున్నారు.
అలాగే కొందరికి వంశ పారంపర్యంగా కూడా వస్తుంది.
అయితే కారణం ఏదైనా రొమ్ము క్యాన్సర్‌కు దూరంగా ఉండాలని కోరుకునే స్త్రీలు.
ప్రతి రోజూ సైక్లింగ్ చేయాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.అవును, సైక్లింగ్ చేస్తే రొమ్ము క్యాన్సర్‌కు దూరంగా ఉండొచ్చు.
ప్రతి రోజు ఉదయం లేదా సాయంత్రం వేళలో ఒకే ఒక్క అర గంట పాటు స్త్రీలు సైకిల్ తొక్కితే.శరీరం మొత్తానికి రక్త ప్రసరణ సక్రమంగా సాగి శరీరంలోని అన్ని భాగాలకూ సరి పడినంత ఆక్సిజన్ అందుతుంది.

అదే సమయంలో శరీరంలో అదనంగా పేరుకు పోయిన కొవ్వు అంతా కరిగి పోతుంది.తద్వారా రొమ్యు క్యాన్సర్ బారిన పడే రిస్క్ తగ్గు ముఖం పడుతుందని అంటున్నారు.పైగా, స్త్రీలు రెగ్యులర్‌గా సైక్లింగ్ చేయడం వల్ల.ఎముకలు, కండరాలు దృఢంగా మారతాయి.రక్త పోటు స్థాయిలు అదుపులో ఉంటాయి.

ఇక స్త్రీలలో చాలా మంది ఇంటి పనులు, వంట పనులతో విసిగి పోయి ఒత్తిడి, డిప్రెషన్ వంటి మానసిక సమస్యలకు గురవుతుంటాయి.అయితే అలాంటి వారు ప్రతి రోజు ముప్పై లేదా నలబై నిమిషాల పాటు ప్రశాంతమైన వాతావరణంగా సరదాగా సైక్లింగ్ చేస్తే ఎటువంటి మానసిక సమస్యలైనా పరార్ అయిపోతాయి.