కరోనా వ్యాక్సిన్ ట్రయల్స్‌కు రామాయంపేట యువకుడు..

రోజురోజూకు కరోనా వైరస్ మహమ్మారి ఉద్ధృతంగా విస్తరిస్తోంది.ప్రపంచవ్యాప్తంగా కరోనా వ్యాక్సిన్ కోసం క్లినికల్ ట్రయల్స్ జరుగుతున్నాయి.

 Ramayampeta Young Man For Corona Vaccine Trial, Corona Vaccine Trial, Ramayampet-TeluguStop.com

భారత్‌లో కూడా అన్ని రాష్ట్రాల్లో వ్యాక్సిన్ కోసం ప్రయోగాలు చేస్తున్నారు.ఈ ప్రయోగాల్లో పాల్గొని కరోనా నిర్మూలనకు తమ వంతు సాయంగా స్వచ్ఛందంగా ముందుకు వస్తున్నారు పలువురు.

అయితే, తెలంగాణలో కూడా ఐసీఎంఆర్, డీసీజీఐ ఇచ్చిన అనుమతి మేరకు భారత్ బయోటెక్ ఆధ్వర్యంలో నిమ్స్‌లో కరోనా వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్ జరుగుతోన్నాయి.ఇప్పటి వరకు ముగ్గురిపై ఈ ప్రయోగాలు నిర్వహించారు.

వ్యాక్సిన్ తీసుకోవడంతో రాష్ట్రంలో నాలుగో వ్యక్తిగా రామాయంపేట ఎండీ ముబీన్‌ ఎంపికయ్యారు.

ముబీన్‌ నిమ్స్‌ దవాఖానకు ఫోన్‌ చేసి స్వయంగా వెళ్లి సంప్రదించాడు.

నిమ్స్‌ వైద్య బృందం అన్నిరకాల పరీక్షలు చేసేందుకు నమూనాలను తీసుకుని, ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ మెడికల్‌ రీసెర్చ్‌ ఢిల్లీకి పంపించారు.అనంతరం ముబీన్‌కు నిమ్స్‌ వైద్య బృందం ఫోన్‌చేసి ప్రయోగానికి అర్హులని, ఆస్పత్రికి రావాల్సిందిగా తెలిపింది.

శనివారం ఉదయం ముబీన్‌పై కరోనా వ్యాక్సిన్‌ టీకా ప్రయోగం చేశారు.ముబీన్ పూర్తి ఆరోగ్యంగా ఉన్నాడని ఓ వీడియోను కూడా విడుదల చేశారు నిమ్స్‌ వైద్యులు.

వ్యాక్సిన్ ట్రయల్స్‌కు ముబీన్‌ ఎంపికై, ఆరోగ్యంగా కోలుకోవడం అభినందనీయమని రామాయంపేట మున్సిపల్‌ చైర్మన్‌ జితేందర్‌గౌడ్‌ అన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube