మనిషి జీవితంలో చివరి దశ మరణం.అది ఎప్పుడు ఏ రూపంలో వస్తుందో ఊహించడం చాలా కష్టం.
ఈ మరణం మనిషిలో స్వార్ధాన్ని కూడా పెంచి పోషిస్తుంది.ఎవరినైన అడిగి చూడండి నాకోసం నువ్వు మరణిస్తావా అని.చివరికి కట్టుకున్న భార్య అయినా, కన్న కొడుకు అయినా ఆస్తులు పంచుకుంటారే గానీ మరణాన్ని మాత్రం పంచుకోరు.ఒక వేళ అలాంటి వారు ఉన్నారంటే అతడు చాలా అదృష్టవంతుడు.
ఇకపోతే కరోనా వల్ల అయిన వారే దగ్గరికి రావడానికి బయపడుతున్నారు.ఇలాంటి సమయంలో వైద్య సిబ్బంది ప్రాణాలకు తెగించి రోగులకు నిస్వార్ధంగా సేవలు అందిస్తున్నారు.
అలా కరోనా రోగులకు వైద్యం చేస్తున్న క్రమంలో ఆ రక్కసి ఎందరో వైద్య సిబ్బందిని కబళించింది.
తాజాగా ఓ డాక్టర్ మీద దాడికి చేసింది.
కారంచేడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో విధులు నిర్వర్తిస్తున్న డాక్టర్ నర్తు భాస్కరరావు ప్రస్తుతం ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు.ఇక తొలుత సాధారణ చికిత్స, తీసుకున్న ఆయన.తర్వాత విజయవాడ ఆయుష్ హాస్పిటల్లో చేరారు.అక్కడ పరిస్థితి ఆందోళనకరంగా మారడంతో కుటుంబ సభ్యులు సోమాజిగూడ యశోదలో చేర్పించారు.
మే 11నుంచి వెంటిలేటర్ మీద చికిత్సపొందుతున్న భాస్కరరావును మెరుగైన చికిత్స కోసం గచ్చిబౌలిలోని కేర్ హాస్పిటల్ చేర్పించారు.కాగా రెండు లంగ్స్ పూర్తిగా దెబ్బతినడంతో ఊపిరితిత్తుల మార్పిడి చేయాలట.
ఇందుకు గాను కోటి రూపాయల వరకు ఖర్చు అవుతుందని, నెలలోపే సర్జరీ పూర్తి చేయాలని ఆయన భార్య భాగ్యలక్ష్మి వివరించారు.ఇక ఆమెకూడా డాక్టరే.ఇక భాస్కరరావు ఆరోగ్యపరిస్థితి పై వృద్ధులైన తల్లిదండ్రులతో సహా మొత్తం కుటుంబం ఆందోళన చెందుతోంది.కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, దాతలు సాయానికి ముందుకొచ్చి తమ కుటుంబాన్ని ఆదుకోవాలని డా.భాగ్య చేతులు జోడించి వేడుకుంటున్నారు.