ఆ వివాదం తేలకుండానే కన్ను మూసిన లత మంగేష్కర్‌.. చివరికి..!

మన టాలీవుడ్ లో ఘంటసాల, పి.సుశీల ఎంత గొప్ప పేరు తెచ్చుకున్నారో బాలీవుడ్‌లో మహ్మద్‌ రఫీ, లతా మంగేష్కర్‌ అంతే గొప్ప పేరు తెచ్చుకున్నారు.

 Controversy Of Singer Latha Mangeshkar , Guinness Book Of World Records , Moha-TeluguStop.com

వీళ్లు తమ మధురమైన గాన మాధుర్యంతో సినిమా ప్రేక్షకుల హృదయాలను తాకారు.ఇద్దరూ కలిసి కొన్ని వందల పాటలకు ఊపిరి పోసారు.

ఇండస్ట్రీకి ముందుగా మహ్మద్‌ రఫీ రాగా లత మంగేష్కర్‌ ఆయన కంటే మూడేళ్లు లేటుగా వచ్చారు.ఆయన పాడిన తొలిపాట 1944లో రికార్డ్‌ అయితే ఆమె పాడిన ఫస్ట్ సాంగ్ 1947లో రికార్డ్‌ అయ్యింది.అయితే రఫీ కంటే వేగంగా లత పాటలు పాడారు.1977 నాటికి ఈ మెలోడియస్ సింగర్ పాతికవేల పాటలు పాడి సంచలనం సృష్టించారు.అప్పట్లో ఇన్ని పాటలు పాడిన మరో సింగర్ లేరు.దాంతో అత్యధిక పాటలు పాడిన గాయనిగా లతా మంగేష్కర్ కి గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డ్స్‌లో చోటు దక్కింది.

మహ్మద్‌ రఫీ ఆమె ఘనతను చూసి చాలా బాధపడిపోయారు.వాస్తవానికి వారి మధ్య ఎలాంటి గొడవలు లేవు.ఒకరంటే ఒకరికి చాలా గౌరవం.రఫీ ఆమెకు దక్కిన ఈ ఘనతను గురించి ఎందుకు బాధపడ్డారంటే తాను కూడా రికార్డు స్థాయిలో పాటలు పాడానని అనుకున్నారు.

ఆమె కంటే ముందు నుంచే ఇండస్ట్రీలో ఉండి పాటలు పాడుతున్నానని ఫీలయ్యారు.అందుకే తనకే ఈ రికార్డు వచ్చి ఉండాలని, తనకు కాకుండా ఆమెకెందుకు ఇచ్చారు? అని బాధపడ్డారట.లత కంటే తనకే ఆ బుక్‌లో స్థానం ఎర్న్ చేసుకునే ఎలిజిబిలిటీ ఉన్నట్టు అందరి ముందు మాట్లాడేవారట.

Telugu Bollywood, Ghantasala, Guinness, Mohammed Rafi, Suhseela, Tollywood-Movie

గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డ్స్‌ 1977 ఎడిషన్‌లో లతా మంగేష్కర్‌( Latha mangeshkar ) అత్యధిక పాటలు పాడిన సింగర్ అంటూ వివరాలను ప్రచురించింది.1948-74 మధ్యకాలంలో గ్రామ్‌ఫోన్‌ సినిమా కేటగిరిలో లత 25 పాతికవేలకు పైగా పాటలు పాడినట్లు వెల్లడించింది.లత సోలో, డ్యూయెట్‌, కోరస్‌, గ్రూప్‌ సాంగ్స్‌ ఇలా చాలా రకాల పాటలు పాడారు.20 భారతీయ భాషల్లో అనర్గళంగా పాటలు పాడుతూ అందరికీ దగ్గరయ్యారు.ఒక 1974 ఏడాదిలోనే ఆమె ఏకంగా 1800 పాటలు పాడినట్లు గిన్నిస్‌ వరల్డ్ రికార్డ్స్ బుక్‌లో పబ్లిష్ చేశారు.1977లో మహ్మద్‌ రఫీ లత ఘనతను సవాల్‌ చేస్తూ గిన్నిస్‌ బుక్‌ వాళ్లకు ఓ లెటర్ రాశారు.“1944 నుంచి సినీ రంగంలో ఉన్నా, కానీ నా సేవలకు తగిన గుర్తింపు లభించలేదు.లతా మంగేష్కర్ నా కంటే ఎక్కువ పాటలు ఎలా పాడగలిగారో నాకు అర్థం కాలేదు. లతా ఐదు షిఫ్టుల్లో పాటలు పాడినట్లు చెప్పడం తప్పు.నేను రోజుకు రెండు పాటలు పాడేవాన్ని, కొన్నిసార్లు ఐదు పాటలు కూడా పాడానని ప్రూవ్ చేయగలను.నేను మొత్తం 23 వేల పాటలు పాడను.

లత మాత్రం అలా పాడలేదు ఆమె పాటలు పాడటం స్టార్ట్ చేసిన సమయాన్ని నుంచి రోజుకు ఒక్కో పాట పాడితే 9300 పాటలు మాత్రమే అవుతాయి.నేను డైలీ రెండు పాటలు పాడాను.

ఆ మాటలకు ఆధారాలను కూడా అటాచ్ చేస్తున్నా.నిజాయితీ కలిగిన భారతీయ ఏజెన్సీ ద్వారా వాస్తవాలను నిర్ధారించాలని కోరుకుంటున్నా.ఈ రికార్డుకు సంబంధించిన పేజీని నిజాలు తేలేవరకు ఖాళీగా ఉంచాలని ఆశిస్తున్నా.” అని ఆ లేఖలో రఫీ పేర్కొన్నారు.

Telugu Bollywood, Ghantasala, Guinness, Mohammed Rafi, Suhseela, Tollywood-Movie

అయితే గిన్నిస్ బుక్( Guinness Book of World Records ) వాళ్ళు ఆ వివరాలను పరిశీలిస్తామని హామీ ఇచ్చారు.లేఖ అందుకున్న రెండు సంవత్సరాల తర్వాత కూడా పేరు తొలగించలేదు.ఈ పేరు చూసుకుంటూ రఫీ( Mohammed Rafi ) బాగా బాధపడిపోయేవారు.ఆ అసంతృప్తితోనే ఆయన 1980 జులై 31న తుది శ్వాస విడిచారు.1984లో గిన్నిస్‌ బుక్‌ ఓ ఎడిషన్‌ రిలీజ్ చేసింది.అందులో అత్యధిక పాటలు పాడిన గాయనిగా లత పేరును యథావిధంగా ఉంచింది.1944-1980 వరకు 11 భాషల్లో 28 వేల సాంగ్స్ పాడానని మహ్మద్‌ రఫీ తనకు తానే చెప్పుకున్నట్లు కూడా గిన్నిస్‌బుక్‌లో ప్రస్తావించారు.ఇక 1991 గిన్నిస్‌బుక్‌ ఎడిషన్‌లో లతా మంగేష్కర్‌, మహ్మద్‌ రఫీ పేర్లను పూర్తిగా రిమూవ్ చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube