అక్కినేని ఫ్యామిలీ నుంచి సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి ఆశించిన స్థాయిలో సక్సెస్ కాని హీరోలలో అఖిల్ ఒకరు.“అఖిల్” సినిమాతో అక్కినేని అఖిల్ కెరీర్ ను మొదలుపెట్టగా తొలి సినిమా ఆశించిన ఫలితాన్ని సొంతం చేసుకోలేదు.ఆ తర్వాత హలో, మిస్టర్ మజ్ను, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్, ఏజెంట్ సినిమాలలో నటించారు.ఈ సినిమాలలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్(Most Eligible Bachelor ) సినిమా మాత్రమే హిట్ గా నిలిచింది.
అఖిల్( Akhil Akkineni ) నటించిన సినిమాలలో మెజారిటీ సినిమాలు ప్రేక్షకులను నిరాశకు గురి చేశాయి.అఖిల్ కొత్త సినిమా యూవీ క్రియేషన్స్ బ్యానర్(UV Creations ) లో ఒకింత భారీ బడ్జెట్ తో తెరకెక్కనుందని సమాచారం అందుతోంది.అయితే ఈ సినిమాకు సంబంధించి అధికారికంగా ఎలాంటి అప్ డేట్ లేదు.ఈ విషయం తెలిసిన అభిమానులు ఇంకెన్ని రోజులు అఖిల్ అంటూ కామెంట్లు చేస్తున్నారు.
అఖిల్ సైతం మీడియాకు దూరంగా ఉండటం వల్ల చాలా ప్రశ్నలు ప్రశ్నలుగానే మిగిలిపోతున్నాయి.అఖిల్ రెమ్యునరేషన్ కు సంబంధించి కూడా వేర్వేరు వార్తలు ప్రచారంలోకి వస్తున్నాయి.అఖిల్ భవిష్యత్తు సినిమాలకు సంబంధించి క్లారిటీ వస్తే అభిమానుల టెన్షన్ తగ్గే అవకాశాలు అయితే ఉంటాయి.అఖిల్ నెక్స్ట్ లెవెల్ స్క్రిప్ట్ లలో నటించాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.
బ్యాక్ టు బ్యాక్ సినిమాలలో అఖిల్ నటిస్తే అఖిల్ కెరీర్ పరంగా మరింత ఎదిగే అవకాశాలు అయితే ఉంటాయి.అఖిల్ సొంత బ్యానర్ సినిమాలలో నటిస్తే బాగుంటుందని మరి కొందరు చెబుతున్నారు.
నాగార్జున కుబేర ప్రమోషన్స్ లో భాగంగా అఖిల్ కెరీర్ గురించి స్పందించి క్లారిటీ ఇస్తారేమో చూడాలి.అక్కినేని అఖిల్ కెరీర్ ప్లాన్స్ మాత్రం ఆహా అనేలా ఉండాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.