తెలంగాణ సీఎం కేసీఆర్ పై కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.కేసీఆర్ దేశంలోనే అసమర్థపు ముఖ్యమంత్రి అని ఎద్దేవా చేశారు.
బీఆర్ఎస్ కోసం ఉత్తర తెలంగాణ హక్కులను కేసీఆర్ కాలరాస్తున్నారని జీవన్ రెడ్డి విమర్శించారు.కేంద్ర, రాష్ట్ర హక్కులను కాలరాస్తుంటే కేసీఆర్ ప్రకటనలు, తీర్మానాలతో కాలం వెళ్లదీస్తున్నారని మండిపడ్డారు.
బీఆర్ఎస్, బీజేపీ తోడు దొంగలన్నారు.ఎస్ఆర్ఎస్పీ నీటిని మహారాష్ట్రకు తరలించాలని చూస్తే సహించేది లేదని వెల్లడించారు.