కాంగ్రెస్ ఎన్నికల కమిటీ సమావేశం .. నేడు ఏపీ అభ్యర్థుల ప్రకటన 

ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్( Congress ) అధికారంలోకి రావడంతో మంచి ఉత్సాహంగా ఉన్న ఆ పార్టీ అధిష్టానం.ఏపీ లోనూ పార్టీని బలోపేతం చేసి, మెజార్టీ సీట్లను సాధించే లక్ష్యంతో టిడిపి, జనసేన, బిజెపి పొత్తులతో ఎన్నికలకు వెళుతుండగా, వైసిపి ఒంటరిగానే పోటీ చేస్తుంది.

 Congress Central Election Committee Ap Candidates Announcement Today Details, Co-TeluguStop.com

ఈ పార్టీల కంటే భిన్నంగా ఎన్నికల ప్రచారం నిర్వహించడంతో పాటు, బలమైన అభ్యర్థులను పోటీకి దించాలనే ఆలోచనతో ఉంది.ఇప్పటికే అభ్యర్థుల ఎంపికను దాదాపుగా స్క్రీనింగ్ కమిటీ ఖరారు చేసింది.

తుది జాబితా పై చర్చించి ఆమోదం ముద్ర వేయడమే మిగిలి ఉంది.ప్రస్తుతం అభ్యర్థుల జాబితా ప్రకటనపై కాంగ్రెస్ అధిష్టానం దృష్టి సారించింది.

ఈ మేరకు ఈరోజు ఏఐసీసీ కార్యాలయంలో కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ( Congress Central Election Committee ) సమావేశం జరగనుంది.ఈ సమావేశంలోనే అభ్యర్థుల ఎంపిక, ప్రకటనపై నిర్ణయం తీసుకోబోతున్నారు.

Telugu Aicc, Ap Congress, Ap, Congress, Dipadas Munshi, Rahul Gandi, Sonia Gandi

నిన్న రాత్రి ఢిల్లీలో కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ చైర్మన్ మధుసూదన్ మిస్త్రీ నేతృత్వంలో జరిగిన సమావేశంలో లోక్ సభ, అసెంబ్లీ అభ్యర్థుల తొలి జాబితా పై చర్చించారు.దీంట్లో స్క్రీనింగ్ కమిటీ సభ్యులు సూరజ్ హెగ్డే, షఫీ పరంబిల్ లతో పాటు పార్టీ ఏపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల,( YS Sharmila ) పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మాణిక్యం ఠాకూర్ , ( Manickam Thakur ) రఘువీరా రెడ్డి ,కొప్పుల రాజు తదితరులు పాల్గొన్నారు.అన్ని స్థానాలకు సంబంధించిన తుది జాబితాను ఖరారు చేయగా, ఆశావాహులు ఎక్కువగా ఉన్న స్థానాల్లో మాత్రం రెండు మూడు పేర్లతో కూడిన జాబితాను కేంద్ర ఎన్నికల కమిటీ ముందు ఉంచనున్నారు.

Telugu Aicc, Ap Congress, Ap, Congress, Dipadas Munshi, Rahul Gandi, Sonia Gandi

ఈరోజు రాత్రికి ఏపీ అభ్యర్థుల జాబితాపై( AP Congress Candidates ) పూర్తి ప్రకటన రాబోతోంది.కొంతమంది పేర్లతో మొదటి విడత జాబితా లేదా, మొత్తం అన్ని స్థానాలకు అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉంది.తెలంగాణలో పెండింగ్ లో ఉన్న నాలుగు పార్లమెంట్ స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేయబోతున్నారు.

సిఇసి సమావేశంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ కుమార్ రెడ్డి, తెలంగాణ పార్టీ వ్యవహారాల ఇన్చార్జి దీపాదాస్ మున్షి తదితరులు పాల్గొన్నారు

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube