తెలంగాణలో ఇప్పటికే రెండుసార్లు అధికారం దక్కించుకున్న బిఆర్‌ఎస్ పార్టీ( BRS party ) ముచ్చటగా మూడోసారి అధికారం కోసం తెగ ఆరాటపడుతోంది.ఈసారి ఎలాగైనా గెలిచి మూడోసారి హ్యాట్రిక్ ముఖ్యమంత్రిగా కేసిఆర్ ను చరిత్రలో నిలపాలని ఆ పార్టీ గట్టిగా ప్రయత్నిస్తోంది.
అయితే ప్రస్తుతం బిఆర్‌ఎస్ కు కాంగ్రెస్( Congress BRS ) నుంచి గట్టి పోటీ ఎదురవుతున్నప్పటికి బిఆర్‌ఎస్ నేతలు మాత్రం విజయంపై పూర్తి ఆత్మవిశ్వాసంతో ఉన్నారు.అయితే విన్నింగ్ పై బిఆర్‌ఎస్ నేతలు ఎంత కాన్ఫిడెంట్ గా ఉన్నప్పటికి ఆ పార్టీ నేతలను ఓ కన్ఫ్యూజన్ మాత్రం పట్టిపిడిస్తోంది.

ఈసారి బిఆర్‌ఎస్ గెలిస్తే సిఎం పదవి కేసిఆర్( CM kcr ) చేపడతారా ? లేదా వర్కింగ్ ప్రసిడెంట్ కేటిఆర్ కు ముఖ్యమంత్రి బాద్యతలు అప్పగించి కేసిఆర్ జాతీయ రాజకీయాలపై ఫోకస్ పెడతారా ? అనే ప్రశ్నలు బిఆర్‌ఎస్ నేతలను తెగ వెంటాడుతున్నాయి.ఎందుకంటే ఆ పార్టీ నేతలలో చాలమంది ఇప్పటికే కేటిఆర్ ముఖ్యమంత్రి అవుతారని బహిరంగంగానే వ్యాఖ్యానించిన సందర్బలు ఉన్నాయి.కానీ కేటిఆర్ మాత్రం ఈసారి కూడా కేసిఆరే ముఖ్యమంత్రిగా ఉంటారని పలు మార్లు స్పష్టం చేశారు కూడా.అయినప్పటికి ఎన్నికలు దగ్గర పడే కొద్ది ఆ అంశం మరోసారి హాట్ టాపిక్ గా మారుతోంది.

ఒకవేళ కేటిఆర్( KTR ) సిఎం పదవి అధిష్టిస్తే పార్టీలో అందరూ ఎమ్మేల్యేలు ఏకీభవిస్తారా అనే సందేహాలు కూడా కొందరిలో వ్యక్తమౌతున్నాయి.ప్రస్తుతం కేసిఆర్ ఐటీ శాఖ మంత్రిగా ఎన్నో పరిశ్రమలను రాష్ట్రానికి తీసుకురావడంలోనూ పెట్టుబడులను ఆకర్షించడంలోనూ కీలక పాత్ర పోషించారు.కాబట్టి ఇప్పుడు సిఎం పదవిలో కూడా కేటిఆర్ తనదైన ముద్రా వేస్తారని బిఆర్‌ఎస్ లోని చాలమంది నేతలు భావిస్తున్నారు.కాబట్టి వచ్చే ఎన్నికల్లో గెలిస్తే పరిస్థితులనుసారంగా కేటిఆర్ కు ముఖ్యమంత్రి బాద్యతలు అప్పగించిన ఆశ్చర్యం లేదనేది కొందరి అభిప్రాయం.
అయితే ఈ విషయాలపై క్లారిటీ రావాలంటే డిసెంబర్ 3 న వెలువడే ఫలితాలను బట్టి తేలుతుందని విశ్లేషకులు చెబుతున్నారు.మరి బిఆర్‌ఎస్ లో నెలకొన్న ఈ కన్ఫ్యూజన్ పై ఎలాంటి క్లారిటీ వస్తుందో చూడాలి.