టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా కొనసాగుతున్న సమంత( Samantha ) ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉన్న సంగతి మనకు తెలిసిందే.గత కొద్దిరోజులుగా మాయోసైటీస్ ( Mayositis ) అనే వ్యాధితో బాధపడుతున్నారు.
ఈ వ్యాధి నుంచి కోలుకోవడం కోసమే ఈమె కొంతకాలం పాటు సినిమాలకు దూరంగా ఉంటున్నారు.ఇక ఇటీవల భూటాన్ వెళ్లినటువంటి ఈమె అక్కడ ఆయుర్వేద చికిత్స తీసుకుంటున్న సంగతి తెలిసిందే.
ఇలా మయోసైటిస్ కోసం చికిత్స తీసుకుంటున్నటువంటి ఈమె ఈ వ్యాధి నుంచి తొందరగా కోలుకోవాలని అభిమానులు కూడా కోరుకుంటున్నారు.ఇక సినిమాలకు దూరంగా ఉన్నటువంటి సమంత సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్ గా ఉంటున్నారు.

ఈమె తన ట్రీట్మెంట్ కి సంబంధించినటువంటి అన్ని విషయాలను కూడా సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంటున్నారు.ఇకపోతే తాజాగా సమంత గురించి ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.సమంత పిల్లల( Kids ) విషయంలో ఒక గొప్ప నిర్ణయం తీసుకున్నారంటూ ఈ వార్త వైరల్ అవుతుంది.సమంత ఇప్పటికే ఎన్నో సేవా కార్యక్రమాలను చేస్తున్న సంగతి మనకు తెలిసిందే.
ఈమె ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్న ప్రత్యూష ఫౌండేషన్ ( Pratyusha Foundation ) ద్వారా ఎంతోమంది చిన్నారులకు వైద్య చికిత్సలు అందించడమే కాకుండా వారి బాగోగులు కూడా ప్రత్యూష ఫౌండేషన్ ద్వారా చూసుకుంటున్నారు.గత 11 సంవత్సరాలుగా ఈమె ఈ ఫౌండేషన్ నడుపుతున్నారు.

ఇలా ప్రత్యూష ఫౌండేషన్ ద్వారా ఎంతోమందికి సహాయంగా నిలిచినటువంటి సమంత మరో ఇద్దరు చిన్నారులకు బంగారు భవిష్యత్తు అందించడానికి సిద్ధమయ్యారని తెలుస్తుంది.ఈమె ఇద్దరు పిల్లలను దత్తత ( Adopt ) తీసుకోబోతున్నారని ఇలా దత్తత తీసుకున్నటువంటి ఈమె వారి పూర్తి బాధ్యతలను నిర్వర్తించబోతున్నారని తెలుస్తుంది.ఇలా సమంత పిల్లల దత్తత తీసుకోబోతున్నారు అంటూ వార్తలు వస్తున్నాయి కానీ ఈ వార్తలపై ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన లేదు.







