ఫామ్ హౌజ్ ప్రలోభాల కేసు నిందితుల కస్టడీ పిటిషన్ పై ఏసీబీ కోర్టులో వాదనలు ముగిశాయి.కేసులో ప్రధాన నిందితులుగా ఉన్న ముగ్గురిని ఐదు రోజులు కస్టడీకి ఇవ్వాలని పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు.
ఈ పిటిషన్ ను విచారణకు స్వీకరించిన ఏసీబీ కోర్టు ఇరు పక్షాల వాదనలు వినింది.ఈ క్రమంలో నిందితుల కస్టడీ పిటిషన్ పై రేపు తుది తీర్పు వెలువరించనుంది.
ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం కేసులో రామచంద్రభారతి, నందకుమార్, సింహయాజులు నిందితులుగా ఉన్న సంగతి తెలిసిందే.