Bigg Boss show CPI Narayana : బిగ్ బాస్ షో పై మరోసారి సీరియస్ వ్యాఖ్యలు చేసిన సీపీఐ నారాయణ..!!

తెలుగు బిగ్ బాస్ రియాల్టీ షో బ్యాన్ చేయాలని ఫస్ట్ నుండి సీపీఐ నారాయణ వ్యతిరేకిస్తున్న సంగతి తెలిసిందే.బిగ్ బాస్ హౌస్ బ్రోతల్ హౌస్ అని అన్నారు.

 Cpi Narayana Once Again Made Serious Comments On Bigg Boss Show , Cpi Narayana,-TeluguStop.com

టాస్కుల పేరుతో అశ్లీలకరమైన కంటెంట్ ప్రోత్సహిస్తున్నారని.సంచలన ఆరోపణలు చేశారు.

ఇటువంటి షో వల్ల యువత పాడైపోతుందని.పదుల సంఖ్యలో యువతీ యువకులను ఒక గదిలో పెట్టేసి అలా చిత్రీకరించటం దారుణమని గతంలో విమర్శించారు.

తాజాగా మరోసారి.ఈ షో ఒక సాంఘిక దురాచారం లాంటిదని మండిపడ్డారు.

బిగ్ బాస్ షో రద్దు చేసే వరకు తన పోరాటం ఆగదని స్పష్టం చేశారు.బిగ్ బాస్ షో రద్దు చేయాలని తెలంగాణ హైకోర్టులో పిటిషన్ వేస్తే స్వీకరించలేదని చెప్పుకొచ్చారు.

కానీ ఏపీ హైకోర్టు మాత్రం స్పందించింది.అందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు.

 ఇప్పటికే ఈ షోకి సంబంధించి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు.షో నిర్వాహకులకు నోటీసులు పంపడం జరిగింది.

మరోపక్క ప్రస్తుతం జరుగుతున్న సీజన్ సిక్స్ చివరి దశకు చేరుకుంది.ఇలాంటి తరుణంలో తెలుగు బిగ్ బాస్ రియాల్టీ షో విషయంలో ఏపీ హైకోర్టు తదుపరి ఏం చేస్తుందన్నది ఆసక్తికరంగా మారింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube