2050 నాటికి మనుషులు నివసించేలా శుక్రగ్రహంపై కాలనీలు.. ఓషన్‌గేట్ కోఫౌండర్ అదిరిపోయే ప్లాన్..

ఇతర గ్రహాలపైకి వెళ్లి అక్కడే నివాసం ఏర్పాటు చేసుకోవాలనే కోరిక ప్రజల్లో రోజురోజుకూ బలపడుతోంది.ఈ నేపథ్యంలోనే ఓషన్‌గేట్ ఎక్స్‌పెడిషన్స్ సహ-స్థాపకుడు గిల్లెర్మో సోహ్‌న్లెయిన్( Guillermo Söhnlein ) ఓ క్రేజీ ఐడియా చేశారు.వీనస్‌లో ఫ్లోటింగ్ కాలనీని నిర్మించాలని డిసైడ్ అయ్యారు.2050 సంవత్సరం లోగా అక్కడ వ్యక్తులు జీవించవచ్చని ఆశిస్తున్నారు.ఇటీవలి కాలంలో టైటాన్ అనే జలాంతర్గామి ప్రమాదంలో ఐదుగురు ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే.గిల్లెర్మో టైటాన్‌</em కోఫౌండర్‌గా ఉన్నారు.ఈ ప్రమాదం తన సంస్థ వల్లే జరిగినా శుక్రునిపైకి ప్రజలను తీసుకెళ్లాలని గిల్లెర్మో నిశ్చయించుకున్నారు.మానవులు వీనస్ వాతావరణంలోని నిర్దిష్ట భాగంలో, దాని ఉపరితలం నుంచి 30 మైళ్ల ఎత్తులో జీవించగలరని ఆయన విశ్వసిస్తున్నారు.

 Colonies On Venus So That Humans Can Live By 2050. Oceangate Co-founder's Plan,-TeluguStop.com

వీనస్( Venus) భూమికి దగ్గరి గ్రహం, కానీ ఇది చాలా వేడిగా, విషపూరితంగా ఉంటుంది.భూమి ఉపరితలం నుంచి కొన్ని కిలోమీటర్ల ఎత్తులో ఒత్తిడి, ఉష్ణోగ్రత ఎలా ఉంటుందో అది మాదిరి శుక్రగ్రహంపై ఒత్తిడి, ఉష్ణోగ్రత ఉంటుంది.

గ్రహంపైన మేఘాలలో ప్రమాదకరమైన సల్ఫ్యూరిక్ ఆమ్లాలు కూడా ఉంటాయి.శుక్రునిపై ఉన్న ఈ తరహా కఠినమైన పరిస్థితులను తట్టుకోగల తెలియాడే కాలనీని నిర్మించాలని గిల్లెర్మో అనుకుంటున్నారు, ఇది ప్రస్తుతం అక్కడ మానవులు నివసించడానికి వీలుకాదు.

కానీ కాలనీ నిర్మించడం మానవాళికి ఒక పెద్ద అవకాశం అవుతుందని, దానిని మనుషులు మిస్ కాకూడదని అతను చెబుతున్నారు.

Telugu Colony, Humansvenus, Hurricane Winds, Oceangate, Venus-Latest News - Telu

గంటకు 224 మైళ్ల వేగంతో వీచే వీనస్ శక్తివంతమైన గాలులను ఎలా నిర్వహించాలో అతనికి సరిగ్గా తెలియనప్పటికీ, స్మార్ట్ ఇంజనీర్లు, శాస్త్రవేత్తలు ఓ సొల్యూషన్ కనిపెట్టగలరని గిల్లెర్మో అభిప్రాయపడ్డారు.2050 నాటికి, వీనస్‌పై దాదాపు 1,000 మంది ప్రజలు నివసించే ఫ్లోటింగ్ కాలనీని ఏర్పాటు చేయాలనే తన ఆలోచన నిజమవుతుందని అతను ఆశాభావం వ్యక్తం చేశారు.ఇది చాలా పెద్ద కల, కానీ అది నెరవేరుతుందని అతను భావిస్తున్నారు.

Telugu Colony, Humansvenus, Hurricane Winds, Oceangate, Venus-Latest News - Telu

వీనస్‌పై ఫ్లోటింగ్ కాలనీ( Venus Floating colony ) సృష్టించడం సాధ్యమేనా అనే దానిపై శాస్త్రవేత్తలు భిన్నాభిప్రాయాలు ఉన్నారు.కొందరు ఇది సాధ్యం అని నమ్ముతారు, మరికొందరు అది సాధ్యం కాదని నమ్ముతారు.వీనస్‌పై ఫ్లోటింగ్ కాలనీ సాధ్యమేనా అనేదానికి అనేక సవాళ్లు ఉన్నాయి.కాలనీ శక్తివంతమైన గాలులను తట్టుకోగలగాలి.మానవులు అవసరమైన అన్ని సౌకర్యాలను అందించగలగాలి.కాలనీని భూమి నుంచి వనరులను తరలించడానికి సాధ్యమైనంత తక్కువ ఖర్చుతో నిర్మించాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube