రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి కోసం తీసుకొచ్చన మన ఊరు-మన బడి/మన బస్తి-మన బడి పథకంలో భాగంగా ఖమ్మం CMR షాపింగ్ మాల్ యాజమాన్యం ఖమ్మం నియోజకవర్గంలోని ప్రభుత్వ పాఠశాలల అభివృద్ది కోసం ముందుకొచింది.
మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పిలుపు మేరకు ఖమ్మం నియోజకవర్గం లోని ప్రభుత్వ పాఠశాలల అభివృద్ది కోసం నేడు మంత్రి పదవి బాధ్యతలు చేపట్టి మూడేళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా CMR షాపింగ్ మాల్ రూ.50 లక్షల చెక్కును రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కి సంస్ధ చైర్మన్ ఫౌండర్ మావూరి వెంకటరమణ అందజేశారు.
మంత్రి పువ్వాడ మాట్లడుతూ ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేందుకు రూపొందించిన ఈ పథకంతో తమ పాఠశాల విద్యను ఎలాంటి ఆటంకాలు లేకుండా కొనసాగించేందుకు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి పలువురు ఆసక్తి కనబరిచి వితరణ ఇవ్వడానికి ముందుకొస్తున్నరని, నేడు రూ.50లక్షలు అందజేసిన CMR వారికి ధన్యవాదాలు తెలిపారు.
ఎలాంటి ఆటంకాలు లేకుండా ప్రభుత్వ విద్యను కొనసాగించేందుకు వసతులు కల్పించాలని, ప్రభుత్వం నిర్ణయించిందని, దశల వారీగా డిజిటల్ విద్యా విధానాన్ని ప్రవేశపెట్టి, విద్యార్థుల అభ్యసన సామర్థ్యాన్ని పెంచాలని ప్రభుత్వం భావిస్తోందన్నారు.
దీనికోసమే మన ఊరు-మన బడి/మన బస్తి-మన బడి పథకాన్ని ఆవిష్కరించిందని, దాతలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు.
స్కూళ్ల ఆధునీకరణ, మౌలిక సదుపాయల కల్పన చేపట్టనుందని, ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా తొలి విడతలో ఎంపిక చేసిన అన్ని ప్రభుత్వ పాఠశాలలో నిర్దేశించిన పనులు పూర్తి అయ్యాయని, విద్యార్థులు ఆయా సౌకర్యాలు వాడుకుంటున్నారని వివరించారు.
రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మార్చేందుకే తెలంగాణ ప్రభుత్వం మన ఊరు-మన బడి, మన బస్తి-మన బడి పథకాన్ని ఆవిస్కరించిందని, రానున్న రోజుల్లో ప్రైవేట్ కంటే ధీటుగా ప్రభుత్వ విద్యను మరింత బలోపేతం చేసి సామాన్యులకు కూడా కార్పొరేట్ కి మించి విద్యను అందించేందుకు ముఖ్యమంత్రి కేసీఅర్ ప్రణాళికలు చేశారని వివరించారు.
కార్యక్రమంలో మేయర్ పునుకొల్లు నీరజ, జిల్లా కలెక్టర్ VP గౌతం, మున్సిపల్ కమిషనర్ ఆదర్శ్ సురభి తదితరులు ఉన్నారు.