పవన్ కళ్యాణ్. ఇది పేరు కాదు ఇది ఒక బ్రాండ్ …ఆయనకి ఫ్యాన్స్ ఉండరు కేవలం భక్తులే ఉంటారు.
అందుకే పవన్ కళ్యాణ్ సినిమా వస్తుంది అంటే చాలు ఆయన ఫ్యాన్స్ లో పూనకాలు మొదలైపోతాయి ఆయన సినిమా ఎలా ఉన్నా కూడా టాక్ నెగటివ్ గా చెప్తే మాత్రం ఒప్పుకోరు.అంతేకాదు పవన్ కళ్యాణ్ ని ఒక్క మాట అన్నా కూడా ఆయన అభిమానులు ఊరుకోరు.
అయితే పవన్ కళ్యాణ్ సినిమాల్లో కొన్ని పరాజ్యం పాడైన కూడా అభిమానుల మనసులు చూరగొన్నాయి.అలా అభిమానుల మనసు గెలిచిన పవన్ ఆ ఫ్లాప్ చిత్రాలు ఏంటో ఒకసారి చూద్దాం పదండి.
గుడుంబా శంకర్
పవన్ కళ్యాణ్ ప్రతిసారి ట్రెండ్ సృష్టిస్తాడు అనే విషయం మనకు తెలిసిందే.గుడుంబా శంకర్ సినిమాలో విచిత్రంగా డబల్ ప్యాంట్ వేసి సినిమాకి పిచ్చ క్రేజ్ నీ తీసికచ్చాడు.డబల్ పాయింట్ ఫ్యాషన్ చాలామంది ఆ రోజుల్లో పవన్ కోసం వేసుకున్నారు అంటే అది మామూలు అభిమానం కాదు.
కాటమరాయుడు
ఒక పవన్ కళ్యాణ్ మొదటిసారిగా ఫుల్ లెన్త్ లుంగీలో కనిపిస్తూ ఉంటాడు ఈ సినిమాలో.ఈ చిత్రం సైతం ఆయన అభిమానులను ఎంతగానో ఇంప్రెస్ చేసింది కానీ కమర్షియల్ సినిమాగా మాత్రం నిలవలేకపోయింది.
అన్నవరం
మన తెలుగు ప్రేక్షకులకు ఈ సెంటిమెంట్ సినిమాలపై ఇంట్రెస్ట్ ఎక్కువగా ఉంటుంది.సిస్టర్ సెంటిమెంట్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు.అలా సిస్టర్ సెంటిమెంట్ తోచిన అన్నవరం సినిమా కూడా ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది కానీ సినిమా మాత్రం ఫ్లాప్ లిస్టులో పడింది.
కొమరం పులి
పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా కొమరం పులి సినిమాలో పవన్ కళ్యాణ్ నటన అద్భుతంగా ఉంటుంది.మేకింగ్ కోసం నాలుగేళ్లు గ్యాప్ తీసుకోవడంతో ప్రేక్షకుల్లో అంచనాలు పెరిగిపోయి ఈ సినిమాకి అనుకున్నంత రేంజ్ లో హిట్ టాక్ రాలేదు.
జానీ
పవన్ కళ్యాణ్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా జానీ.ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తే అతడి మాజీ భార్య రేణు దేశాయ్ హీరోయిన్ గా నటించింది.వీరిద్దరి ప్రేమ గుర్తుగా వచ్చిన ఈ సినిమా చాలామందికి ఇప్పటికీ టీవీలో వస్తే చూస్తుంటారు కానీ అప్పట్లో థియేటర్లో మాత్రం హిట్ అవ్వలేకపోయింది.