తెలంగాణ సీఎం కేసీఆర్ సంగారెడ్డి జిల్లాలో పర్యటించనున్నారు.ఇందులో భాగంగా పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవం, శంకుస్థాపనలు చేయనున్నారు.
ముందుగా మేధా రైల్ కోచ్ ఫ్యాక్టరీని సీఎం కేసీఆర్ ప్రారంభించనున్నారు.తరువాత కొల్లూరులో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన డబుల్ బెడ్ రూం ఇళ్లను ఆయన ప్రారంభించనున్నారు.
ఆసియాలోనే అతిపెద్ద డబుల్ బెడ్ రూం ఇళ్ల టౌన్ షిప్ 145 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించిన సంగతి తెలిసిందే.తరువాత పటాన్ చెరులో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రికి కేసీఆర్ శంకుస్థాపన చేయనున్నారు.
అనంతరం బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు.సీఎం కేసీఆర్ పర్యటన నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.