హైదరాబాద్ లో మరో మెగా ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టింది తెలంగాణ ప్రభుత్వం.ఇందులో భాగంగా మెట్రో రెండో దశ నిర్మాణానికి సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేశారు.
ఈ మేరకు హైదరాబాద్ లోని మైండ్ స్పేస్ వద్ద కేసీఆర్ భూమి పూజ చేశారు.అనంతరం తెలంగాణ పోలీస్ అకాడమీ వద్ద నిర్వహిస్తున్న బహిరంగ సభకు ఆయన హాజరుకానున్నారు.
మైండ్ స్పేస్ నుంచి శంషాబాద్ ఎయిర్ పోర్టు వరకు ఈ మెట్రో నిర్మాణం జరగనుంది.మొత్తం రూ.6,250 కోట్ల నిధులతో మెట్రోను విస్తరించనున్నారు.31 కిలోమీటర్ల దూరాన్ని 26 నిమిషాల్లో మెట్రో చేరనుంది.
అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తున్నారు అధికారులు.పిల్లర్లతో పాటు 2.5 కిలో మీటర్ల మేర భూగర్భంలో రైలు మార్గాన్ని నిర్మించనుంది.అవుటర్ రింగ్ రోడ్ వెంట నిర్మించే ఈ మార్గంంలో 120 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించేలా ఎయిరో డైనమిక్ టెక్నాలజీని వినియోగించనున్నారు.
రాయదుర్గం నుంచి ఎయిర్ పోర్టు వరకు మొత్తం 9 స్టేషన్లు ఉండనుండగా, కార్గోలైన్ తోపాటు ప్యాసింజర్ లైన్ వేర్వురుగా ఉంటాయని అధికారులు వెల్లడించారు.