YSRTP అధ్యక్షురాలు వైయస్ షర్మిల తన పాదయాత్రకి పోలీసుల అనుమతులు ఇవ్వకపోవడంపై నిరసన వ్యక్తం చేయడానికి రెడీ అయ్యారు.పాదయాత్ర వల్ల వరంగల్ జిల్లాలో శాంతిభద్రతలకు విఘతం కలుగుతుందన్న కారణంతో వరంగల్ పోలీస్ కమిషనర్ అనుమతి నిరాకరించడంతో అసహనం వ్యక్తం చేశారు.
దీంతో ఈరోజు మధ్యాహ్నం 12 గంటల నుండి లోటస్ పాండ్ లో షర్మిల దీక్షకు రెడీ అయ్యారు.పాదయాత్రకి పోలీసులు అనుమతులు ఇవ్వకపోవడం నిరసిస్తూ.
దీక్ష ప్రారంభించనున్నారు.ఆల్రెడీ షర్మిల పాదయాత్రకు.
హైకోర్టు అనుమతి ఇవ్వడం జరిగింది.
అయినా గాని పోలీసులు… పర్మిషన్ ఇవ్వకపోవడంపై షర్మిల మండిపడుతున్నారు.
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వైయస్సార్ షర్మిలా చేపట్టిన పాదయాత్ర పొలిటికల్ గా గల్లీ నుండి ఢిల్లీ దాకా హైలైట్ అయ్యింది. ఇటీవల ప్రధాని మోడీ కూడా షర్మిలాకి ఫోన్ చేయడం జరిగింది.
దీనికి ప్రధాన కారణం ఇటీవల ఆమె కాన్వాయ్ పై టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు దాడికి పాల్పడటం.షర్మిల పాదయాత్రను టిఆర్ఎస్ శ్రేణులు అడ్డుకోవడం జరిగింది. ఈ క్రమంలో పాదయాత్ర కొనసాగితే మళ్ళీ ఇటువంటి దాడులు పునరావృతం అయ్యే అవకాశం ఉందని పోలీసులు భావిస్తున్నారు.ఈ పరిణామంతో షర్మిల పాదయాత్రకు అనుమతులు ఇవ్వడం లేదు.
న్యాయస్థానం అనుమతి ఉన్న పోలీసులు పాదయాత్రకి పరిమిషన్ ఇవ్వకపోవడం నిరసిస్తూ షర్మిల దీక్షకు రెడీ అయ్యారు.