పులివెందులలో సీఎం జగన్ నామినేషన్..!

ఏపీ సీఎం జగన్( AP CM Jagan) పులివెందుల వైసీపీ అభ్యర్థి నామినేషన్ వేశారు.ఈ మేరకు కడప జిల్లా పులివెందుల రిటర్నింగ్ అధికారికి సీఎం జగన్ నామినేషన్ పత్రాలను అందజేశారు.

 Cm Jagan's Nomination In Pulivendula , Ap Cm Jagan , Nomination, Pulivendula,-TeluguStop.com

జగన్ నామినేషన్ కార్యక్రమానికి పార్టీ నేతలు, కార్యకర్తలతో పాటు ప్రజలు భారీగా తరలివచ్చారు.ఈ క్రమంలో జై జగన్ నినాదాలతో విధులు మార్మోగాయి.

నామినేషన్ వేయడానికి ముందు పులివెందులలోని సీఎస్ఐ గ్రౌండ్ లో నిర్వహించిన భారీ బహిరంగ సభలో సీఎం జగన్ పాల్గొన్నారు.

నామినేషన్ వేసిన జగన్ ముందుగా కడప ఎయిర్ పోర్టుకు వెళ్లనున్నారు.

అక్కడి నుంచి గన్నవరం( Gannavaram)కు చేరుకోనున్నారు.కాగా ఇవాళ్టితో నామినేషన్ల ఘట్టం ముగియనుంది.

ఈ నెల 18వ తేదీన నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభమైన సంగతి తెలిసిందే.ఈ క్రమంలో మధ్యాహ్నం 3 గంటలకు నామినేషన్ల గడువు ముగియనుంది.

రేపు నామినేషన్ల పరిశీలన జరగనుంది.అదేవిధంగా నామినేషన్ల ఉపసంహరణకు ఈ నెల 29 చివరి తేదీ.

వచ్చే నెల 13న పోలింగ్ జరగనుండగా.జూన్ 4వ తేదీన ఫలితాలు వెల్లడికానున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube